నాలుగు కేసుల్లో అడ్డంగా దొరికారు, జరిగేదిదే - సజ్జల..!!
టీడీపీ అధినేత చంద్రబాబు కేసులపై సజ్జల కీలక అంశాలు వెల్లడించారు. లక్ష మంది గోబెల్స్ కలిస్తే ఒక చంద్రబాబు అని పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఇష్టానుసారం దోచుకున్నారని విమర్శించారు. నాలుగు కేసుల్లో చంద్రబాబు అండ్ టీం పై పూర్తి ఆధారాలు ఉన్నాయని..అడ్డంగా దొరికారని వెల్లడించారు. ఆధారాలను సీఐడీ కోర్టు ముందు ఉంచిదని చెప్పారు. ఇందులో రాజకీయ కక్షకు అవకాశం లేదని సజ్జల స్పష్టం చేసారు.
పూర్తి ఆధారాలతోనే
స్కిల్ స్కాం కేసులో పూర్తి ఆధారాలతోనే సీఐడీ చంద్రబాబును కోర్టు ముందు ప్రవేశ పెట్టిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. . స్కాం దర్యాప్తులో ప్రభుత్వ ప్రమేయం లేదని సజ్జల స్పష్టం చేసారు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉందన్నారు. ఈ 20 రోజుల్లో లోకేశ్ ముఠా నానా యాగీ చేసిందని పేర్కొన్నారు. ప్రజలకు సంబంధించిన సొమ్ము దోపిడీకి గురైందని సజ్జల వివరించారు.సాక్ష్యాధారాలతో దొరికితే కోర్టు రిమాండ్‌కు పంపిందని గుర్తు చేసారు. జరిగిన స్కామ్ పైన వీరంతా మాట్లాడటం లేదన్నారు. దొంగతనం చేసి సానుభూతి కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్ట్ ను దేశ సమస్యలా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.

కక్ష సాధింపు లేదు
మేధావులు అనుకుంటున్న కొందరితో స్టేట్‌మెంట్లు ఇప్పిస్తున్నారని సజ్జల పేర్కొన్నారు. తాము రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నామని ఆరోపిస్తున్నారని..అలా చేయాలంటే అధికారంలోకి వచ్చిన వెంటనే అరెస్ట్ చేసేవాళ్లమని వ్యాఖ్యానించారు. అప్పటికే కావాల్సిన ఆధారాలు ఉన్నాయన్నారు. పూర్తిగా విచారణ చేసిన తరువాత సీఐడీ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టిందని చెప్పుకొచ్చారు. నాలుగు కేసులు విచారణలో ఉన్నాయని..వీటిలో పూర్తి ఆధారాలతో చంద్రబాబు టీం దొరికిపోయిందని చెప్పారు. అడ్డంగా దొరికిన దోపిడీ దొంగల ముఠాకు ఎల్లో సపోర్ట్ చేస్తోందని సజ్జల మండిపడ్డారు. ఇదే సమయంలో తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆదానీ సీఎం జగన్ ను కలవటం పైనా స్పందించారు.
విదేశాలకు వెళ్లారు
ఆదానీ ముఖ్యమంత్రి జగన్ ను కలవటంలో రహస్యం లేదన్నారు. పెట్టుబడుల అంశం పైన చర్చించేందుకే సీఎం నివాసానికి వచ్చారని చెప్పారు. టీడీపీ అంటే తోడు దొంగల పార్టీ. ముఠా నాయకుడు చంద్రబాబును కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. ఈ కేసుల్లో పూర్తి ఆధారాలు కోర్టుకు సమర్పిస్తుందని వివరించారు. ఈ నాలుగు కేసుల్లోనూ కిలారి రాజేశ్ కీలకంగా ఉన్నారని వెల్లడించారు. చంద్రబాబు పీఏగా పని చేసే వ్యక్తి సచివాలయంలో ఉద్యోగిగా ఉంటూ అకస్మికంగా అమెరికా ఎలా వెళ్లారని ప్రశ్నించారు. అన్ని వివరాలు విచారణలో బయటకు వస్తాయని సజ్జల పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications