వైసీపీలో ఆడియోల కలకలం-అవంతి పార్ట్ 1 తేలకుండానే పార్ట్ 2 లీక్-పోలీసులకు సవాల్
ఏపీలో పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనిపాస్ ఆడియో టేపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా లీకైన ఆడియో సంభాషణపై విశాఖ పోలీసులు విచారణ జరుపుతుండగానే దీని పార్ట్ 2 కూడా లీకవడం కలకలం రేపుతంది. సోషల్ మీడియాలో ఇది కాస్తా వైరల్ కావడం వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీనిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో వైసీపీ మంత్రి అవంతి తన ప్రత్యర్ధులకు టార్గెట్ గా మారిపోతున్నారు. వీలైనంత త్వరగా ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు శ్రమిస్తున్న పోలీసులు.... యూట్యూబ్, ఫేస్ బుక్ లకు నోటీసులు జారీ చేశారు.

వైసీపీ సర్కార్ లో ఆడియో లీకులు
వైసీపీ సర్కార్ లో పర్యాటకశాఖ మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాస్ ఓ మహిళతో మాట్లాడారని భావిస్తున్న ఆడియో టేపు లీకవడం తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్రమంత్రిగా ఉన్న వ్యక్తి మహిళతో అభ్యంతరకర సంభాషణలు జరిపినట్లు ఆడియో టేపుల్లో వినిపిస్తుండటంతో పోలీసులు దీనిపై సీరియస్ గా విచారణ చేపడుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారం వైసీపీ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. దీనిపై విపక్షాలు మంత్రి అవంతిని టార్గెట్ చేయడంతో ఆయన కూడా సమాధానం చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారు. పోలీసులే ఈ వ్యవహారాన్ని తేలుస్తారని చెప్తున్నారు.

అవంతి ఆడియో పార్ట్ 1 లీక్
తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ ఓ మహిళతో అభ్యంతరకరంగా మాట్లాడుతున్నట్లున్న ఆడియో సంభాషణ లీకైంది. దీంతో మీడియాలో దీనిపై వార్తలొచ్చాయి. ఇందులో ఉన్న సంభాషణను మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ కావడంతో మంత్రి చిక్కుల్లో పడ్డారు. తాను అలాంటి వ్యక్తిని కాదని చెప్పుకొచ్చారు. పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశానని, వారే నిజానిజాలు తేలుస్తారని వెల్లడించారు. కానీ పోలీసులు ఇప్పటివరకూ ఏమీ తేల్చకపోవడంతో ఈ వ్యవహారం ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో మంత్రి కావడంతో అవంతి తప్పు చేశారా లేదా అన్న దానిపై చర్చ రోజురోజుకీ ముదురుతోంది.

పార్ట్ 1 తేలక ముందే పార్ట్ 2 లీక్
మంత్రి అవంతి శ్రీనివాస్ మహిళతో సంభాషణ జరిపినట్లు భావిస్తున్న ఆడియో పార్ట్ 1 లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు దీనిపై విచారణను ముమ్మరం చేశారు. అయితే పార్ట్ 1 నిజమా కాదా అన్నది తేలకముందే పార్ట్ 2 కూడా తెరపైకి వచ్చింది. ఇందులో మొదటి సంభాషణకు కొనసాగింపుగా మరో సంభాషణ ఉండటంతో ఈ వ్యవహారంపై విశాఖ పోలీసులు తలపట్టుకుంటున్నారు. అసలు ఈ ఆడియోలను ఎవరు లీక్ చేస్తున్నారన్న దానిపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. సాధ్యమైనంత త్వరగా నిందితుల్ని పట్టుకుంటామని చెప్తున్నారు. తాజా ఆడియోను సైతం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్లు తెలుస్తోంది.

పోలీసులకే వదిలిపెట్టిన అవంతి శ్రీనివాస్
తాను మహిళతో మాట్లాడినట్లు ఉన్న ఆడియో సంభాషణ పార్ట్ 1 లీక్ కాగానే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అవంతి శ్రీనివాస్.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారే విచారణ జరిపి నిజానిజాలు బయటపెడతారని చెప్పారు. ఇప్పుడు పార్ట్ 2 కూడా లీక్ కావడం, వైరల్ కావడంతో ఆయన ఇరుకునపడ్డారు. అయినా దీనిపైనా పోలీసులే తేలుస్తారని మంత్రి అవంతి చెప్తున్నారు. పోలీసుల విచారణలోనే వాస్తవాలు బయటపడతాయని చెప్పుకొస్తున్నారు. అయితే ఈ ఆడియో లీక్ లతో మంత్రి పరువంతా బజారున పడుతోంది. ఈ వ్యవహారంలో నిజనిజాలు తేలడంలో ఆలస్యమైతే వైసీపీకి ఇదో తలనొప్పిగా మారే ప్రమాదం కనిపిస్తోంది.

యూట్యూబ్, ఫేస్ బుక్ కు నోటీసులు
ఏపీ పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ మహిళతో మాట్లాడినట్లు ఉన్న ఆడియో టేపులు లీకై సంచలనం రేపుతున్న నేపథ్యంలో విశాఖ పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ ఆడియో టేపులు వైరల్ అవుతున్న సోషల్ మీడియాపై వారు దృష్టిపెట్టారు. అసలు ముందుగా ఎవరు వీటిని సోషల్ మీడియాలో పెట్టారన్న దానిపై పోలీసులు క్లూలు సేకరిస్తున్నారు. అసలే ఈ సోషల్ మీడియా యుగంలో ముందుగా ఎవరు పోస్ట్ చేశారన్న దానిపై క్లూలు దొరకడం కష్టంగా మారింది. దీంతో సోషల్ మీడియా సంస్ధలైన ఫేస్ బుక్, యూట్యూబ్ కు విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ ఆడియోకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని కోరుతున్నారు. త్వరలో ఈ వివరాలు పోలీసులకు అందే అవకాశముంది.

వైసీపీ సర్కార్ కు తలనొప్పులు
వైసీపీ సర్కార్ లో, అదీ కాబోయే కార్యనిర్వాహక రాజధాని విశాఖలో కీలక మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాస్ మహిళతో రాసలీలల సంభాషణ జరిపినట్లు ఆడియోలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో వాటి వాస్తవికత నిరూపణ కష్టంగా మారింది. అయితే ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు నోరు మెదిపేందుకు ఇష్టపడటం లేదు. మరేదైనా వ్యవహారంలో అవంతిని సమర్ధిస్తూ మాట్లాడేందుకు అవకాశం ఉందేమో కానీ ఈ వ్యవహారం సున్నితమైనది కావడంతో వైసీపీ నేతలు కూడా స్పందించేందుకు నిరాకరిస్తున్నారు.
దీంతో వైసీపీ సర్కార్ కు అవంతి ఆడియో టేపుల వ్యవహారం రోజురోజుకూ తలనొప్పిగా మారుతోంది. అదే సమయంలో విశాఖ పోలీసులపైనా ఒత్తిడి పెరుగుతోంది. త్వరగా విచారణ పూర్తి చేయాలని విశాఖ పోలీసుల్ని వైసీపీ సర్కార్ కోరుతోంది. దీంతో వారు కూడా ఉరుకులు పరుగులు తీస్తున్నారు.
Recommended Video

సొంత పార్టీ నేతల హస్తం?
మంత్రి అవంతి శ్రీనివాస్ మహిళతో జరిపినట్లు చెబుతున్న ఆడియో లీక్, సోషల్ మీడియాలో వైరల్ వ్యవహారంలో కొందరు వైసీపీ నేతల హస్తం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా విశాఖ వైసీపీలో అవంతి అంటే గిట్టని వారే ఈ ఆడియో లీక్ చేసి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. లేకపోతే ప్రస్తుత పరిస్ధితుల్లో ఓ మంత్రి ఫోన్ కాల్ ఆడియోను లీక్ చేయడం అసాధ్యమనే వాదన వినిపిస్తోంది.
అవంతి అంటే గిట్టని వారే ఆయన్ను ట్రాప్ చేసి ఈ ఆడియో రికార్డు చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మంత్రి అవంతి మాత్రం ఏ విషయాన్నీ అంగీకరించడం లేదు. పోలీసులే తేలుస్తారని మాత్రమే చెప్తున్నారు. పోలీసుల విచారణపైనే ఆయన పూర్తిగా భారం వేశారు. దీంతో సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తయి వాస్తవాలు తేలాలని వైసీపీ నేతలు కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications