జగన్, షర్మిల మళ్లీ కలిసిపోతున్నారు - పులివెందుల సీనియర్ సంచలనం..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. మాజీ సీఎం జగన్ - పీసీసీ చీఫ్ షర్మిల గురించి మరో సారి చర్చ మొదలైంది. తన అన్న జగన్ తో విభేదించిన తరువాత షర్మిల తొలుత తెలంగాణలో సొంత పార్టీతో రాజకీయం చేసారు. తరువాత కాంగ్రెస్ లో చేరి ఏపీలో పీసీసీ చీఫ్ అయ్యారు. 2024 లో పోటీ చేసి ఓడిపోయారు. జగన్ ను టార్గెట్ చేయటానికి ప్రాధాన్యత ఇచ్చిన షర్మిల తీరులో కొంత కాలంగా మార్పు కనిపిస్తోంది. కాగా.. ఇప్పుడు అన్నా - చెల్లి తిరిగి కలిసిపోతున్నారని పులివెందుల వైసీపీ సీనియర్ నేత చెప్పిన అంశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
మాజీ సీఎం జగన్ .. పీసీసీ చీఫ్ షర్మిల తిరిగి త్వరలోనే కలిసిపోయే అవకాశాలు ఉన్నాయని కడప జిల్లా పులివెందుల కు చెందిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ సతీష్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. జగన్‌కు చెల్లెలు అంటే అభిమానమని, ఆయన ఎప్పుడూ తప్పులు చేయరని సతీష్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం వైఎస్ షర్మిల ఏపీసీసీ చీఫ్‌గా వ్యవహరిస్తూ, కూటమిపైనే విమర్శలు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.

గతంలో చేసిన విదంగా జగన్‌పై ఆరోపణలు చేయడం లేదన్నారు. ఇది మంచి పరిణామమని, అందరూ స్వాగతించాల్సిందేనని అన్నారు. జగన్‌కు తన చెల్లెలంటే ప్రత్యేక అభిమానం ఉందని, కుటుంబాన్ని ఎప్పుడూ గొప్పగా భావించే వ్యక్తి అని తెలిపారు. తాను జగన్‌ను దగ్గరగా చూశానని, ఆయన ఎప్పుడూ కావాలని తప్పులు చేసే మనిషి కాదని అన్నారు.అన్నా చెల్లెళ్లు మళ్లీ కలిసే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా షర్మిల ప్రస్తుతం ప్రధానంగా అధికార కూటమిపైనే విమర్శలు చేస్తూ వస్తున్నారు. జగన్ గురించి కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఆమె బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం లేదు. ఒక రాజకీయ పార్టీ నేతగా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించడం సహజమేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. గతంలో వైసీపీపై తీవ్ర విమర్శలు చేసిన షర్మిల ఇప్పుడు వైఖరిలో మార్పు చూపుతున్నారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

జగన్ తో విభేదించిన తరువాత తొలిసారి తన అన్న జన్మదినం వేళ శుభాకాంక్షలు చెప్పారు. దీనికి సమాధానంగా జగన్ సైతం ప్రత్యేకంగా షర్మిలను అమ్మా అంటూ ప్రేమ చూపించారు. దీని ద్వారా ఇద్దరి మధ్య తిరిగి సానుకూల వాతావరణం ఏర్పడుతున్నట్లు చర్చ జరుగుతోంది. అయితే, అసలు ఇది సాధ్యమా కాదా అనేది కాలమే డిసైడ్ చేయాల్సి ఉంది. కాగా.. ఈ వ్యవహారం మాత్రం వైసీపీతో సహా ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చగా మారింది.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
నేటి నుంచి ఒంటమిట్ట రాములోరి ఆలయంలో.. !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications