జగన్ మాజీ మంత్రి జనసేనలో ఎంట్రీకి బ్రేక్, తిరిగి మళ్లీ..!!

ఏపీలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి పార్టీలు 2029 ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. అటు మాజీ సీఎం జగన్ త్వరలోనే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా పర్యటించి కార్యకర్తలతో సమావేశాలకు సిద్దం అవుతున్నారు. వైసీపీ 2024 ఎన్నికల్లో ఓడిన తరువాత ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కూటమి పార్టీల్లో చేరారు. కాగా, కొంత కాలంగా వైసీపీ మాజీ మంత్రి కూటమిలో ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆయన ప్రయత్నాలు ఫలించటం లేదు. దీంతో... ఆ మాజీ తాజా నిర్ణయం ఏంటనేది ఆసక్తిగా మారింది.

వైసీపీ 2024 ఎన్నికల్లో ఓడిన తరువాత పలువురు ముఖ్య నేతలు పార్టీ వీడారు. అందులో కొందరు కూటమి పార్టీల్లో చేరారు. సాయిరెడ్డి సైతం పార్టీ వీడినా..తన ట్వీట్లతో సంచలనంగా నిలుస్తున్నారు. ఇక.. వైసీపీని వీడి టీడీపీలో చేరిన మోపిదేవి..ఆళ్ల నాని.. జనసేనలో చేరిన బాలినేనికి ఇప్పటి వరకు ఆ పార్టీల్లో ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. అదే విధంగా మరో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారనే స్పష్టత కొరవడుతోంది. ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా, టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన అవంతి... 2019 ఎన్నికల వేళ వైసీపీలో చేరారు.

ysrcp-key-leader-in-touch-with-janasena-to-join-in-the-party-details-here

భీమిలి నుంచి గెలిచి మంత్రి అయ్యారు. మంత్రివర్గ విస్తరణలో పదవి కోల్పోయారు. కాగా, 2024 ఎన్నికల్లో తన మాజీ సహచరుడు గంటా పైన పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత వైసీపీకి దూరమయ్యారు. వైసీపీలో పరిస్థితుల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. కాగా.. అవంతి చాలా కాలం గా జనసేనలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.

అవంతి శ్రీనివాస్ ను జనసేనలో చేర్చుకునేందుకు విశాఖ టీడీపీ నేతల అభ్యంతరాలతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ సైతం ఆసక్తిగా లేరని తెలుస్తోంది. మంత్రిగా ఉన్న సమయంలో పవన్ పైన అవంతి పలు విమర్శలు చేసారు. అదే విధంగా అవంతిని పలు సందర్భాల్లో పవన్ సైతం టార్గెట్ చేసిన అంశాన్ని జనసేన నేతలు గుర్తు చేస్తున్నారు. అదే విధంగా టీడీపీ ముఖ్య నేతలు సైతం అవంతిని తిరిగి కూటమిలో చేర్చుకునేందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తొలుత సన్నిహితులుగా కొనసాగిన గంటా, అవంతి మధ్య గత ఎన్నికల ముందు డైలాగ్ వార్ కొనసాగింది.

అయితే, విశాఖ కార్పొరేటర్ గా ఉన్న తన కుమార్తె ను కూడా వైసీపీ మేయర్ పై అవిశ్వాసం తీర్మానం సందర్భంగా రాజీనామా చేయించారు. అయినా సరే అవంతి శ్రీనివాస్ ను మాత్రం ఎవరూ నమ్మడం లేదు. దీంతో.. అవంతి ప్రస్తుతం మౌనం పాటిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల తరువాత నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో.. కూటమి పార్టీల్లోకి ఆయన కు గ్రీన్ సిగ్నల్ వస్తుందా.. లేక, తిరిగి మళ్లీ వైసీపీలోనే కొనసాగుతా అనేది తేలాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+