జగన్ చెప్పినా వారిలో నమ్మకం లేదా - టెన్షన్, సైలెన్స్..!!
పోలింగ్ తరువాత ఏపీలో అనూహ్య పరిస్థితి కనిపిస్తోంది. పోలింగ్ వరకు గెలుపు పైన ముఖ్య నేతలు పోటీ పడి తమదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేసారు. పోలింగ్ పూర్తయిన తరువాత మాత్రం టీడీపీ, వైసీపీ ముఖ్య నేతలు మౌనంగా ఉంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ తాము 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసారు. కానీ, వైసీపీ ముఖ్య నేతల గెలుపు ఓటమలు పైన చర్చ వేళ..వారంగా మౌనంగా ఉండటంతో కొత్త సంకేతాలు తెర మీదకు వస్తున్నాయి.
విజయం ఎవరిది
ఎన్నికల తరువాత వైసీపీ, టీడీపీ ముఖ్య నేతల తీరు ఆసక్తి కరంగా కనిపిస్తోంది. నిత్యం తమ వ్యాఖ్యలతో టీడీపీ పైన విరుచుకుపడే వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతలు ఒక్క సారిగా సైలెంట్ అయ్యారు. వైసీపీ నేతలు రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వారు తమ గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తూ ఎక్కడా స్పందించలేదు. రోజా నియోజకవర్గం నగరిలో హోరా హోరీ పోరు సాగింది. రోజా పోల్ మేనేజ్ మెంట్ బాగా చేసారని..ఎన్నికల్లో సానుకూల ఫలితం వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఫైర్ బ్రాండ్ నేతల మౌనం
అయితే, సొంత పార్టీ నేతలే రోజాకు వ్యతిరేకంగా పోరాటం చేసారని...ఫలితం ప్రతికూలంగా ఉంటుందనేది వైసీపీలో మరో వర్గం వాదన. ఇక..గన్నవరంలో వల్లభనేని వంశీ, టీడీపీ అభ్యర్ది యార్లగడ్డ వెంకట రావు నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నారు. అదే విధంగా గుడివాడలో కొడాలి నాని సైతం టీడీపీ అభ్యర్ది వెనిగళ్ల రాము తో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ సాగినట్లు పోలింగ్ ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. గెలుస్తామని ఈ ఇద్దరి మద్దతు దారులు చెబుతున్నా...ఇద్దరు నేతలు మాత్రం మౌనంగానే ఉంటున్నారు. ఇక, మంత్రి జోగి రమేష్ పోటీ చేసిన పెనమలూరులోనూ ఫలితం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

ధీమాగా ఉన్నదెవరు
ముఖ్యమంత్రి జగన్ 2019 కంటే మెజార్టీ సీట్లలో విజయం సాధిస్తామని చెబుతున్నారు. నిత్యం వైసీపీ వాయిస్ బలంగా వినిపించే ఈ ఫైర్ బ్రాండ్ నేతలు మాత్రం ఆ తరహాలో విశ్వాసంతో కనిపించటం లేదు. అదే విధంగా పల్నాడు, రాయలసీమ ప్రాంతంలో దాడుల విషయంలో మీడియా ముందుకు వచ్చిన వైసీపీ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే అక్కడ ఫలితం ఏంటో స్పష్టం అవుతోందని టీడీపీ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి. అటు టీడీపీ ముఖ్య నేతల్లోనూ ఫలితాల అంచనాల పైన పెద్దగా స్పందన లేదు. దీంతో..అసలు ఫలితం ఏంటనేది మరింత ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications