ఢిల్లీ కేంద్రంగా జగన్ కొత్త ఆపరేషన్ షురూ, మారుతున్న లెక్కలు..!!
ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటున్నాయి. ఎన్డీఏలో టీడీపీ, జనసేన భాగస్వాములుగా ఉన్నాయి. కేంద్రం - ఏపీలో అధికారం పంచుకున్నాయి. ఏపీలో వైసీపీ లక్ష్యం గా కూటమి పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇదే సమయంలో ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అధినాయకత్వం వైసీపీ మద్దతు కోరటం.. జగన్ సానుకూలంగా స్పందించటం ఆసక్తి కరంగా మారింది. ఇదే సమయంలో ఢిల్లీ కేంద్రంగా మాజీ సీఎం జగన్ కొత్త ఆపరేషన్ మొదలు పట్టారు. ఇదే ఇప్పుడ పార్టీలో కీలక చర్చగా మారుతోంది.
2024 ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాను అధికారంలో ఉన్న సమయంలో కేడర్ ను పట్టించుకోలేదని.. ఈ సారి అలాంటి పరిస్థితి రాదని హామీ ఇస్తున్నారు. కేసులు నమోదైన నేతలు.. కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. దసరా నుంచి జిల్లాల పర్యటనలకు జగన్ సిద్దం అవుతున్నారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు జగన్ హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక, ప్రస్తుతం జరుగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ బీజేపీ నాయకత్వం వైసీపీ మద్దతు కోరటం.. వెంటనే జగన్ ఆమోదించటం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. బీజేపీ నాయకత్వంలోని కూటమి లో టీడీపీ, జనసేన భాగస్వాములుగా ఉన్నాయి.

దీంతో.. జగన్ మరింత ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం మరింత పటిష్ఠం చేయాలని నిర్ణయించారు. సెప్టెంబర్ తొలి వారంలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో ఢిల్లీ కేంద్రంగానూ వైసీపీ కొత్తగా ఐటీ విభాగం ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించింది. ఈ కేంద్రం నిర్వహణా బాధ్యత లను ఎంపీ గురుమూర్తికి అప్పగించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయాలు.. వైపీపీ స్పందన .. రాష్ట్రంలో పరిణామాలను ఢిల్లీ స్థాయిలో వివరించేందుకు వినియోగించుకుంటామని గురుమూర్తి చెప్పారు. అదే విధంగా ఢిల్లీ కేంద్రంగా వైసీపీ పైన జరుగుతున్న వ్యతిరేక ప్రచారం తిప్పి కొట్టేలా ఈ వింగ్ పని చేస్తుందని వివరించారు. ఢిల్లీ కేంద్రంగా జగన్ రానున్న రోజుల్లో కొత్త వ్యూహాలు అమలు చేసేందుకు సిద్దం అవుతున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. దీంతో, జగన్ నిర్ణయాలు ఏంటనేది ఇప్పుడు ఆసక్తి కరగా మారుతోంది.












Click it and Unblock the Notifications