మీరు పీకండి.. పీకించుకుంటాం..! పవన్ కు అంబటి ఘాటు కౌంటర్..!

ఏపీలో రాజకీయ పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ ముదురుతోంది. ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి పార్టీల్ని టార్గెట్ చేస్తూ పెట్టిన పోస్టుల చర్చ జరుగుతూనే ఉంది. అదే సమయంలో కూటమి పార్టీలు వైసీపీని టార్గెట్ చేస్తూ పెడుతున్న పోస్టులపై ఆ పార్టీ నేతలు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. అయితే ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో అమరజీవి జలధార పథకం శంఖుస్థాపనకు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేసారు. దీంతో వైసీపీ నేత అంబటి రాంబాబు ఆయనకు అంతే ఘాటుగా సమాధానం ఇచ్చారు.

వైసీపీ సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వంపై పెడుతున్న పోస్టులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ తీవ్ర విమర్శలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో కానీ, విదేశాల్లో వాగే వాళ్లతో సహా, ఇక్కడ కూర్చుని భవిష్యత్తులో మేం వస్తాం, వచ్చి ఏం చేస్తామంటే.. వచ్చినప్పుడే (అధికారంలో ఉన్నప్పుడే) ఏమీ పీకలేకపోయారు, ఇప్పుడు ఏం మాట్లాడతారంటూ రెచ్చిపోయారు. వచ్చినప్పుడే ఏమీ పీకలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడే ఏం పీకలేకపోయారు.. ఇప్పుడు మీ బెదిరింపులకు భయపడుతామని అనుకుంటున్నారా ? మేము 48గంటల్లో ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మీరలా మాట్లాడలేరని వార్నింగ్ ఇచ్చారు.

ysrcp leader Ambati Rambabu strong retard to pawan kalyan s remarks on social war

వైసీపీ లక్ష్యంగా పవన్ చేసిన ఈ విమర్శలపై ఆ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ లో స్పందించారు. మేము పీకలేకపోయాం, మీరు వచ్చారుగా , వచ్చి పీకండి ! సిద్ధంగా ఉన్నాం పీకించుకోడానికి ! అంటూ అంబటి తనదైన శైలిలో పవన్ పై సెటైర్లు వేశారు. తన కామెంట్స్ కు పవన్ కళ్యాణ్ అకౌంట్ ను కూడా ట్యాగ్ చేశారు. అలాగే పవన్ వైసీపీ టార్గెట్ గా చెప్పిన డైలాగ్స్ వీడియో కూడా జత చేశారు. దీంతో ఈ రెండూ వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+