OG: అంబటి ఆల్ ద బెస్ట్ - పవన్ ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్స్ ..!
ఏపీలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత కూడా అయిన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ఓజీ రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇవాళ రాత్రి నుంచి బెనిఫిట్ షోలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ పై నిత్యం విమర్శలు చేసే వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఓజీకి మాత్రం ఆల్ ద బెస్ట్ చెప్పారు. దీంతో అభిమానులు అవాక్కయ్యారు. అయితే వెంటనే తేరుకుని చేస్తున్న ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి.
"పవన్ జి... "OG"సూపర్ డూపర్ హిట్టై దానయ్(నిర్మాత)కు దండిగా ధనం రావాలని కోరుకుంటున్నాను !" అంటూ సూటిగా సుత్తిలేకుండా అంబటి రాంబాబు ఇవాళ ట్వీట్ చేశారు. అయితే పవన్ పై నిత్యం విమర్శలు గుప్పించే అంబటి చేసిన ట్వీట్ కు ఫ్యాన్స్ మాత్రం ఏమాత్రం కనికరం లేకుండా తమ స్ట్రైల్లో రియాక్ట్ అవుతున్నారు. ముందుగా షో ఎక్కడ బుక్ చేశారు తాతగారూ అంటూ ఓ ఫ్యాన్ అంబటిని ప్రశ్నించాడు.

పవన్ జి... "OG"
— Ambati Rambabu (@AmbatiRambabu) September 24, 2025
సూపర్ డూపర్ హిట్టై
దానయ్యకు దండిగా ధనం
రావాలని కోరుకుంటున్నాను !@DVVMovies @PawanKalyan
ఆ తర్వాత 2024లో పవన్ కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయ్యి మంత్రి పదవి పోయి సినిమాలకు రివ్యూ ఇస్తుంటాడని, అంతకంట పనేముందన్నా రాంబాబు అన్నా అంటూ మరొకరు స్పందించారు. ఫస్ట్ షో అయ్యాక రివ్యూ చెప్పడం మర్చిపోకు తాతా అంటూ మరో అభిమాని స్పందించాడు. ఇంకో అభిమాని అయితే త్వరలో అంబటి జనసేనలో చేరాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపాడు. అందుకే ఈ ట్వీట్లు అన్నాడు.

మీకు ఎందుకు వచ్చిన పత్తి వ్యాపారం అండి ఇది??మీరు పాలిటిక్స్ చూసుకోవచ్చు కదా! అంటూ మరో అభిమాని అంబటి ట్వీట్ కు స్పందించాడు. మనకు ఎందుకు ఈ రివ్యూ లు బాబు... హ్యపీ గా వెళ్లి జగన్ ను పొగుడుకో చాలు. నీ బ్రేకులు,ఇంజను లేని బండికి అదే కరెక్ట్ అంటూ ఇంకో నెటిజన్ స్పందించాడు. ఆ సైకో గాడు చూస్తే ఆఫీస్ కి పిలిపించి కొడతాడు ఎందుకు ఇవన్నీ delete చేసేయ్ రాంబాబు అంటూ మరో నెటిజన్ సలహా ఇచ్చాడు. అప్పట్లో హరిహర వీరమల్లుకు కూడా ఇలాగే చేశాడు, అసలు వీడి ఉద్దేశం ఏంటని మరో అభిమాని ప్రశ్నించాడు.












Click it and Unblock the Notifications