Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోలీసులా..? టీడీపీ కార్యకర్తలా..?: ఈసీ ఫ్లాప్

Anil Kumar Yadav: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఘట్టం ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు సోమవారం నాడు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. అదే సమయంలో తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి.

ఏపీలో కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకూ పోలింగ్ కొనసాగింది. మొత్తంగా 76.50 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సమయంలో కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. పల్నాడు జిల్లా నరసరావుపేట, మాచర్లల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు.

YSRCP leader Anil Kumar Yadav lashes out at EC

ఈ ఉద్రిక్త పరిస్థితులు, పోలింగ్ ప్రక్రియపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. మళ్లీ ఓడిపోతున్నామనే అక్కసుతోనే టీడీపీ దాడులకు పాల్పడిందని ఆరోపించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అయిదు సంవత్సరాల పాటు సాగిన తమ పార్టీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేకపోవడం టీడీపీని ఆందోళనకు గురి చేసిందని పేర్కొంది.

ముంద‌స్తు ప్లాన్ ప్ర‌కార‌మే పల్నాడులో టీడీపీ అరాచకాలకు తెగబడిందని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నరసరావుపేట లోక్‌సభ అభ్యర్థి అనిల్ కుమార్‌ యాదవ్‌, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మాచర్లలో టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారని ధ్వజమెత్తారు. పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి, ఆయన కుమారుడిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారని విమర్శించారు.

పోలింగ్‌ బూత్‌ లోపలికి వెళ్లి మరీ కొందరు టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. తమకు అండగా నిలిచిన గ్రామాలపైనా దాడులు చేశారని చెప్పారు. కొందరు పోలీసులు టీడీపీ అభ్యర్థుల్లా వ్యవహరించారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ దాడులపై తాము ఫోన్లు చేసినా కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీలకు ఫోన్ చేసినా స్పందించలేదని అన్నారు.

విధ్వంసానికి దిగి తమ నాయకులు, కార్యకర్తల తలలు పగులగొడుతూ, ఆడవాళ్ల చీరెలు లాగుతూ, జాకెట్లు చింపుతోంటే రక్షణ కావాలని అడిగినా పోలీసులు పట్టించుకోలేదని అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. దీనిపై తాము ఎస్పీకి ఫోన్ చేస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి దాటవేశారని చెప్పారు.

కొందరు అధికారులు సైతం తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాశారని, వారంతా నిబంధనలకు వ్యతిరేకంగా పని చేశారని, అకారణంగా త‌నను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారని గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తనపై టీడీపీ నాయకులు దాడులు చేస్తే.. తననే హౌస్ అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+