చంద్రబాబు ఇల్లు ముంచేస్తున్నారా? లోకేష్ కు ఫ్లాష్ బ్యాక్ గుర్తుచేసిన అనిల్..!

ఏపీలో విజయవాడ వరదలు ఓవైపు జనాన్ని కంటిమీద కునుకులేకుండా చేస్తుంటే మరోవైపు వీటి కేంద్రంగా రాజకీయాలు కూడా అంతే స్ధాయిలో సాగుతున్నాయి. ముఖ్యంగా వరదల నేపథ్యంలో వ్రకాశం బ్యారేజ్ ను మూడు బోట్లు ఢీకొట్టిన ఘటన ఇప్పుడు టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ మాటల యుద్దానికి కారణమవుతోంది. ఈ బోట్లు ప్రకాశం బ్యారేజ్ గేట్లకు అడ్డంగా పడిపోవడంపై ఇరు పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి.

గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాగే కృష్ణానదికి వరదలు రావడంతో ప్రకాశం బ్యారేజ్ కు బోట్లు కొట్టుకొచ్చాయి. ఇవి బ్యారేజ్ గేట్లకు అడ్డం పడ్డాయి. పది రోజుల పాటు ఇదే పరిస్ధితి కొనసాగింది. దీంతో అప్పట్లో ఉండవల్లి కరకట్టపై ఉన్న విపక్ష నేత చంద్రబాబు ఇంటిని ముంచేందుకే ఈ బోట్లను బ్యారేజ్ కు అడ్డం పెట్టారని టీడీపీ నేతలు విమర్శించారు. ఇందులో తమ పాత్రమే లేదని వైసీపీ మంత్రులు చెప్పుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది.

ysrcp leader anil Yadav ask nara Lokesh over prakasam barrage boats for drowning naidu s house

తాజాగా రెండు రోజుల క్రితం విజయవాడ ప్రకాశ్ బ్యారేజ్ కు వచ్చిన వరదకు గొల్లపూడి నుంచి మూడు బోట్లు వచ్చి ఇలాగే ఇరుక్కుపోయాయి. వీటిని వెంటనే తొలగించే పరిస్ధితి లేకపోవడంతో ప్రభుత్వం అలాగే వదిలేసింది. దీంతో గతాన్ని గుర్తుచేస్తూ వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఓ ట్వీట్ పెట్టారు. ఇందులో మంత్రి నారా లోకేష్ గతంలో చేసిన విమర్శల్ని ఆయన గుర్తుచేశారు. అప్పట్లో చంద్రబాబు ఇల్లు ముంచేందుకు బోట్లు అడ్డుపెట్టారని చెప్పారుగా.. ఇప్పుడు మీరు కూడా అందుకే బోట్లు అడ్డుపెట్టుకున్నారా అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+