టీడీపీ చెప్పేదే గనుక నిజమైతే రాజకీయ సన్యాసానికి రెడీ : బొత్స
విజయవాడ : రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ విషయమై కొద్దిరోజులుగా ఏపీ ప్రభుత్వానికి ప్రతిపక్షానికి మధ్య మాటల యుద్దం నడుస్తోన్న సంగతి తెలిసిందే. కరువు బారినపడ్డ రైతులను ఆదుకోవడం లేదంటూ టీడీపీపై వైసీపీ విమర్శలు గుప్పిస్తోంటే.. ఇప్పటికే ఇన్ పుట్ సబ్సిడీని రైతులకు అందజేశామని అసలు కరువంటే ఏంటో జగన్ కు తెలుసా? అని టీడీపీ ప్రశ్నిస్తోంది.

తాజాగా ఇదే విషయంపై స్పందిస్తూ.. టీడీపీ ప్రభుత్వం రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడం గనుక నిజమైతే రాజకీయ సన్యాసం చేస్తానని తెలిపారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందన్న బొత్స.. అధికారులు, టీడీపీ నాయకులకు కూడా ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఇక అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఓట్లను తొలగిస్తోందని టీడీపీని విమర్శించిన ఆయన దీనిపట్ల అప్రమత్తంగా ఉండాల్సిందిగా వైసీపీ శ్రేణులకు సూచించారు.












Click it and Unblock the Notifications