Botsa Satyanarayana: బొత్సకు మళ్లీ అస్వస్ధత-మండలిలో మాట్లాడుతూనే..!
ఏపీ శాసనమండలిలో విపక్ష నేత, వైఎస్సార్సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ (botsa Satyanarayana)ఇవాళ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. మండలి బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న ఆయన సభలో ఉండగానే.. అసౌకర్యంగా ఉన్నట్లు కనిపించడంతో ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ పక్కనే ఉన్న వారిని అలర్ట్ చేశారు. దీంతో వెంటనే బొత్స సత్యనారాయణను తరలించి స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆయన్ను హైదరాబాద్ తరలించే అవకాశం ఉంది.
గత వారం కూడా బొత్స సత్యనారాయణ హఠాత్తుగా బ్రెయిన్ స్టోక్ కు గురైనట్లు ప్రచారం జరిగింది. మండలి సమావేశాల నుంచి ఇంటికి వెళ్లాక ఒక్కసారిగా రాత్రి అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తరలించి చికిత్స అందించారు. అయితే డాక్టర్ల సూచన మేరకు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న ఆయన.. తన ఆరోగ్యం బాగానే ఉందని ప్రకటించారు. అనంతరం తిరిగి అమరావతికి వచ్చి మండలి సమావేశాల్లో పాల్గొంటున్నారు.

ఇవాళ మరోసారి బొత్స అస్వస్థతకు గురయ్యారన్న వార్తలతో ఆయన అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇవాళ ఆయన బీపీలో హెచ్చుతగ్గుల వల్లే అస్వస్థతకు గురయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ ఇంటికి వెళ్లిపోయారు. రేపోమాపో మరోసారి ఆయన్ను హైదరాబాద్ కు తరలించి మెరుగైన చికిత్స అందించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు ఇంకా స్పందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications