వైసీపీకి మరో షాక్.. కీలక నేత రాజీనామా

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లును కైవసం చేసుకుంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాలను కైవవం చేసుకున్న వైసీపీ ఈసారి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. అధికార వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. వైసీపీ కీలక నేతలు, మంత్రులు ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం జరిగింది.

11 సీట్లలో మాత్రమే విజయం సాధించి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితం అయింది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలైయ్యాయి. వైసీపీ ఘోర ఓటమితో ఆ పార్టీలో గెలిచిన ప్రజా ప్రతినిధులు ఎంతమంది ఉంటారా అనుమానం కలుగుతోంది.ఇప్పటికే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీకి రాజీనామా చేశారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

ysrcp leader chandu sambasivarao quit from party

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా కీలక నేత ఒకరు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గుంటూరు జిల్లాకు చెందిన చందు సాంబశివరావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన చందు సాంబశివరావు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్‌కు పంపించారు. ఆయన ఎన్నికల ముందు బీజేపీ నుంచి వైసీపీలో చేరారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో తిరిగి తన సొంత గూటికి చేరుతున్నట్టు ఆయన వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+