టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు రేపుతున్న జగన్- దేవినేనితో ఆట షురూ..!

విజయవాడ: తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలోని అన్ని 175 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలిచి తీరాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నందున- ఆ దిశగా చర్యలకు దిగుతున్నారు. ఇప్పటికే యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టారు. దీన్ని మరింత ముమ్మరం చేయనున్నారాయన. వై నాట్ 175 అంటూ పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.

 అభ్యర్థుల ఖరారు..

అభ్యర్థుల ఖరారు..

కుప్పంతో- అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమాశాలకు శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్. తన ఉద్దేశం ఏమిటో అప్పట్లోనే స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న స్థానం ఇది. నియోజకవర్గ భేటీలోనే అభ్యర్థి పేరును కూడా అధికారికంగా ప్రకటిస్తూ వస్తోన్నారు. ఇందులో ఎలాంటి రాజీధోరణిని ఆయన ప్రదర్శించట్లేదు. అభ్యర్థిని మార్చే ప్రసక్తి కూడా లేదని తేల్చేస్తోన్నారు.

 విజయవాడ తూర్పుపై..

విజయవాడ తూర్పుపై..

తాజాగా తెలుగుదేశం పార్టీ కంచుకోట విజయవాడ తూర్పు నియోజకవర్గంపై దృష్టి సారించారాయన. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. తన లక్ష్యం ఏమిటనేది తేల్చి చెప్పారు. అప్పటికప్పుడు విజయవాడ తూర్పు అభ్యర్థిని కూడా ఖరారు చేశారు. దేవినేని అవినాష్ పేరును ఖరారు చేశారు. ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించాలని నాయకులకు సూచించారు. ఏవైనా సమన్వయ లోపాలు గానీ, భేదాభిప్రాయాలు గానీ ఉంటే పరిష్కరించుకోవాలనీ అన్నారు.

గద్దెకు పోటీగా..

గద్దెకు పోటీగా..

విజయవాడ తూర్పు నియోజకవర్గం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చేతిలో ఉంది. గద్దె రామ్మోహన్ రావు ఈ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. టీడీపీకి వెన్నంటి ఉంటూ వస్తోన్నట్లుగా భావించే బలమైన కమ్మ సామాజిక వర్గ ఓటుబ్యాంక్ ఉందీ నియోజకవర్గంలో. గద్దె రామ్మోహన్ కూడా ఆ సామాజిక వర్గ నాయకుడే. అందుకే ఆయనకు ధీటుగా దేవినేని అవినాష్ అభ్యర్థిత్వాన్ని వైఎస్ జగన్ ఖాయం చేశారు.

పర్చూరుపైనా..

పర్చూరుపైనా..

అదే సమయంలో అటు పర్చూరుపైనా దృష్టి పెట్టారాయన. ఇది కూడా టీడీపీ సిట్టింగ్ స్థానమే. ఏలూరి సాంబశివ రావు వరుసగా రెండుసార్లు గెలిచారిక్కడ. 2014తో పాటు వైఎస్ జగన్ ప్రభంజనం వీచిన 2019లోనూ ఆయన గెలిచారంటే ఈ నియోజకవర్గంలో టీడీపీ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ నియోజకవర్గం సమన్వయ బాధ్యతలను వైఎస్ జగన్.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కు అప్పగించారు.

 టికెట్ ఖరారుతో..

టికెట్ ఖరారుతో..

కాగా- తనకు టికెట్ ఖరారు కావడంతో దేవినేని అవినాష్ మరింతగా జనంలోకి దూసుకెళ్తోన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకం అవుతున్నారు. ఇవ్వాళ ఆయన 17వ డివిజన్ లో పర్యటించారు. దేవినేని నెహ్రూ చారిటిబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించారు. రాణిగారితోట, గుండు సత్యం గారి రోడ్, సాయి బాబా గుడి, ఉల్లిపాయల రోడ్ ప్రాంతాల్లో పర్యటించారు. సంక్షేమ పథకాల గురించి వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+