ఉత్తరాంధ్ర వైసీపీ సీనియర్ నేత గుడ్ బై..!!

ఏపీలో రాజకీయంగా కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత ఆ పార్టీ సీనియర్లలో అంతర్మధనం మొదలైంది. ఉత్తరాంధ్రలో పార్టీకి భారీ పరాభవం ఎదురైంది. సీనియర్లు అందరూ ఓటమి పాలయ్యారు. ఈ సమయంలోనే శ్రీకాకుళం కు చెందిన మాజీ మంత్రి..వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు రాజకీయ రిటైర్మెంట్ కు సిద్దమయ్యారు. తన కుమారుడికి లైన్ క్లియర్ చేయాలని భావిస్తున్నారు. జగన్ తోనూ చర్చలు చేసారు.

ధర్మాన నిర్ణయం
సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక ఏ ప్రత్యక్ష ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదని నిర్ణయించారు. రెండేళ్ల క్రితమే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని..తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ధర్మాన కోరారు. ఈ ఎన్నికల వరకు పోటీ చేయాలని జగన్ సూచించారు. దీంతో, ధర్మాన తాజా ఎన్నికల్లో పోటీ చేసారు. 52 వేలకుపైగా ఓట్ల తేడాతో తన రాజకీయ జీవితంలోనే ఘోరమైన పరాజయాన్ని ఆయన మూటకట్టుకున్నారు.

YSRCP leader Dharmana decided to quit politics to announce officially

కుమారుడు కోసం
గత ఎన్నికల్లో ఓటమితో ధర్మాన ఆవేదన చెందారు. 1989, 99ల్లో నరసన్నపేట నుంచి, 2004, 09 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి కాంగ్రెస్‌ తరఫున విజయం సాధించిన ఆయన.. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గాల్లో పలు కీలక శాఖలు నిర్వర్తించారు. వాన్‌పిక్‌ కుంభకోణంలో 2012లో సీబీఐ కేసు నమోదు చేయడంతో.. మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయినా 2019లో గెలిచారు. జగన్‌ కేబినెట్‌లో రెవెన్యూ మంత్రిగా పనిచేశారు.

జగన్ తో సమావేశం
ధర్మాన రాజకీయాల నంచి వైదొలిగే ప్రకటనకు ముందు మరోసారి మాజీ సీఎం జగన్ తో సమావేశం కావాలని నిర్ణయించారు. వచ్చే వారం జగన్ తో తాడేపల్లిలో భేటీ కానున్నారు. తాజాగా పార్టీ పరిస్థితి తో పాటుగా భవిష్యత్ రాజకీయాల పైన చర్చించనున్నారు. తన కుమారుడికి రాజకీయంగా అవకాశం కల్పించాలనేది ధర్మాన ఆలోచన. ఈ సారి జగన్ తో ఈ మేరకు ఒప్పించి..నియోజకవర్గంలో తన కుమారుడికి యాక్టివ్ చేయాలని ధర్మాన భావిస్తున్నారు. దీంతో, వచ్చే వారం ధర్మాన రాజకీయంగా కీలక నిర్ణయం ప్రకటించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+