జగన్ పార్టీలో కులపోరు?: టిడిపిలో చేరిన బీసీ రాష్ట్ర నేత
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అధికార పార్టీ తెలుగుదేశం చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్'కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు క్యూ కట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల నేతలు కూడా టిడిపి బాట పడుతున్నారు.
ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గురవాచారి టిడిపిలో చేరిపోయారు.

గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సమక్షంలో గురవాచారి సైకిలెక్కేశారు. ఈ సందర్భంగా గురవాచారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతిపై సంచలన ఆరోపణలు చేశారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కుల పోరు తారస్థాయిలో ఉందని చెప్పారు. వైసీపీలో బడుగు, బలహీన వర్గాలకు సరైన స్థానం లేదన్నారు. సరిగా ఆంగ్లం రాని తనతో పార్టీ తరఫున హైకోర్టులో కేసులు వేయించారని కూడా ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications