సచివాలయాల పేరు మార్పుపై వైసీపీ ఫైర్..! జగన్ క్రెడిట్ చోరీ..?
ఏపీలో వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన సచివాలయాల పేర్లు మార్చేందుకు కూటమి సర్కార్ సిద్దమవుతోంది. నిన్న జరిగిన డేటా డ్రివెన్ గవర్నెన్స్ సదస్సులో సీఎం చంద్రబాబు గ్రామ సచివాలయాల్ని విజన్ యూనిట్లుగా వాడుకోమని సూచించిన నేపథ్యంలో సచివాలయ మంత్రి డీబీవీ స్వామి కూడా పేరు మార్పుపై సంకేతాలు ఇచ్చారు. దీనిపై వైసీపీ ఇవాళ ఘాటుగా స్పందించింది. జగనే అసలు విజనరీ అని తేల్చిచెప్పేసింది.
సచివాలయాలు వైయస్ జగన్ విజన్ యూనిట్లని వైసీపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. జగన్ మార్క్ పాలనకు గ్రామ సచివాలయాలే నిదర్శనం అన్నారు. ఈ నిర్ణయంతో వైయస్ జగనే విజనరీ అని చంద్రబాబే ఒప్పేసుకున్నారన్నారు. సచివాలయాలకు విజన్ యూనిట్లు అని పేరు పెట్టి దీన్ని స్పష్టంచేశారన్నారు. పేరు మార్చినా దాన్ని సృష్టించిన వ్యక్తిని తెలుగు ప్రజలు మర్చిపోరన్నారు.

ఉద్యోగాలు పీకేయడం, కంపెనీలను ప్రైవేటుపరం చేయడమే చంద్రబాబు విజన్ అని కన్నబాబు ఆరోపించారు. వైయస్ జగన్ పథకాలకు పేర్లు మార్చడం, తెచ్చిన కంపెనీలు తన ఘనతగా చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటేనన్నారు.కూటమి పాలనలో ఆస్పత్రుల్లో కరెంట్ ఉండదు, రైతులకు యూరియా దొరకదన్నారు. అయినా చంద్రబాబు విజనరీ అని ఎల్లో మీడియాలో ఎలివేషన్లు ఇవ్వడాన్ని ఆక్షేపించారు. క్రెడిట్ చోర్ అంటూ చంద్రబాబుని కన్నబాబు ఎద్దేవా చేశారు.

డేటా ఆధారిత పాలన అంటారు, కానీ ప్రభుత్వం దగ్గర కనీసం పంట నష్టం డేటా ఉండదని కన్నబాబు ఆరోపించారు. పూర్తి పారదర్శక డేటాతో ఒక్క ప్రభుత్వ వెబ్‌సైట్ ఉన్నా చూపించాలన్నారు. ఒక్కో సీజన్‌కి ఒక్కో పేరుతో చంద్రబాబు మార్కెటింగ్ చేసుకుంటున్నారన్నారు. హెడ్ లైన్స్ కోసమే చంద్రబాబు పనిచేస్తున్నట్టుగా ఉందన్నారు. 1996 నుంచి నేటి వరకు ఒకటే స్క్రీన్ ప్లేతో చంద్రబాబు పాలన ఉందన్నారు. తండ్రీకొడుకులకు పబ్లిసిటీ తప్ప ప్రజా ప్రయోజనాలు అవసరంలేదన్నారు.












Click it and Unblock the Notifications