టీడీపీ తక్కువేమీ తిన్లేదు: అమరావతిలో ఎకరం రూ. వెయ్యిే: డెడ్ చీప్: చిట్టా తీసిన వైసీపీ
Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. తన దూకుడును కొనసాగిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన భవనాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించడం ఖాయంగా కనపిస్తోంది.
రాజధాని అమరావతి పరిధిలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేసిన విషయం తెలిసిందే. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం ఇది. రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. బుల్‌డోజర్లు, ప్రొక్లెయినర్లతో నేలమట్టం చేశారు.

అదే సమయంలో విశాఖపట్నంలో కొత్తగా నిర్మితమైన భవనానికీ నోటీసులు జారీ చేశారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. అక్రమ కట్టడమని, నిర్మాణంలో ఉల్లంఘటనలు చోటు చేసుకున్నాయంటూ నోటీసులు ఇచ్చారు. దాన్ని పార్టీ కార్యాలయానికి అతికించి వెళ్లారు.
ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సీపీకే చెందిన మరో పార్టీ భవనానికీ నోటీసులు అందాయి. అనంతపురంలో కొత్తగా నిర్మాణంలో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయ భవనానికి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ సిటీ టౌన్ ప్లానింగ్ అధికారి ఎం హరిప్రసాద్ ఈ నోటీసులు ఇచ్చారు. ఇంకా పలు చోట్ల వైసీపీ భవనాలకు నోటీసులు అందాయి.
ఇది చిలికి చిలికి గాలీవానగా మారినట్టే కనిపిస్తోంది. పార్టీ కార్యాలయాలు, భూములు, లీజు వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ ఎదురుదాడికి దిగింది. 2014- 2019 మధ్యకాలంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యాలయాల నిర్మాణానికి కేటాయించుకున్న భూముల చిట్టాను తెరమీదికి తీసుకొచ్చింది.
అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏయే జిల్లాల్లో ఎంతమేర ప్రభుత్వ భూములను లీజుకు తీసుకుంది?, కాల వ్యవధి, లీజు మొత్తం వివరాలన్నింటినీ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరు వెంకటరెడ్డి ఓ జాబితాను తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
కడపలో ఎకరం స్థలం 33 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది టీడీపీ. దీనికి చెల్లించాల్సిన లీజు మొత్తం సంవత్సరానికి 1,000 రూపాయలే. గుంటూరులో 3.65 ఎకరాల స్థలాన్ని ఏకంగా 99 సంవత్సరాలకు లీజుకు తీసుకుంది. ఇక్కడా ఎకరా లీజు మొత్తం 1,000 రూపాయలేనని చూపించింది.
విజయనగరంలో 1,000 రూపాయల లీజుకు ఎకరం, గుంటూరులో 1,000 రూపాయల లీజుకు 20 సెంట్లు, కృష్ణాలో 1,000 రూపాయల లీజుకు 95 సెంట్లు, ప్రకాశంలో 1,000 రూపాయల లీజుకు ఎకరం 96 సెంట్లు, కడపలో 1,000 రూపాయల లీజుకు రెండెకరాలు, చిత్తూరులో 1,000 రూపాయల లీజుకు ఎకరం 20 సెంట్ల స్థలాన్ని టీడీపీ కేటాయించింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం.
రాష్ట్రవ్యాప్తంగా మీ టీడీపీ ఆఫీసులు ప్రభుత్వ స్థలాలు లీజుకి తీసుకుని కట్టలేదా?
— VenkataReddy karmuru (@Venkat_karmuru) June 23, 2024
అప్పట్లో ఆ జీవో ఇచ్చింది మీరు కాదా.? దాన్ని పట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు నిర్మించుకున్నది నిజం కాదా?
మీ తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని ఇంకెంత మభ్యపెడతారు?#TDPFakePropaganda pic.twitter.com/tSkZyiU6jk
శ్రీకాకుళం జిల్లాలో 30 సెంట్ల స్థలాన్ని 33 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది గానీ.. ఎంత రేటుకు అనేది వెల్లడించలేదు. అదే జిల్లాలో మరోచోట 99 సంవత్సరాల లీజుకు రెండెకరాలను కేటాయించుకుంది టీడీపీ. దీనికి ఏడాదికి చెల్లించే లీజు రేటు 25 వేల రూపాయలు. ధరలో ఈ తేడా ఎందుకొచ్చిందో వివరించాలని కారుమూరు వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications