వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి-టీడీపీని తీసుకోవాలి-అమిత్ షా భేటీపై లక్ష్మీపార్వతి కామెంట్స్

|
Google Oneindia TeluguNews

నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.వైసీపీ నేతలంతా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీని బలంగా కోరుకుంటున్నారు. అలాగని వైసీపీలోకి రమ్మని మాత్రం కోరడం లేదు. టీడీపీ పగ్గాలు చేపట్టమని డిమాండ్లు చేస్తున్నారు. ఇప్పటికే జూనియర్ సన్నిహితుడు కొడాలి నానితో పాటు పలువురు వైసీపీ నేతలు ఇవే డిమాండ్లు చేస్తుండగా.. ఇవాళ లక్ష్మీపార్వతి కూడా అదే జాబితాలో చేరారు.

ఇవాళ తిరుపతిలో తెలుగు అకాడమీ వ్యవహారాలపై ప్రెస్ మీట్ నిర్వహించిన లక్ష్మీపార్వతి జూనియర్ ఎన్టీఆర్-అమిత్ షా భేటీపై మీడియా ప్రశ్నలు ఎదుర్కొన్నారు. అయితే రేపు దీనిపై స్పందిస్తానని చెప్పిన మీడియా ప్రతినిధులు ఆమెను వదల్లేదు. దీంతో ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ పై మాత్రం స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనికోరుకుంటున్న వాళ్లలో తాను కూడా ఉన్నానంటూ లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని గతంలోనూ లక్ష్మీపార్వతి పలుమార్లు చెప్పారు.

ysrcp leader lakshmi parvathi ask junior ntr to enter politics, take tdp into his hands

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టాలంటూ వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో దీనిపైనా లక్ష్మీపార్వతి స్పందించారు. ఆయన త్వరలోనే వచ్చి టీడీపీని తీసుకోవాలని కోరుకుంటున్నాననన్నారు. అబ్బాయికి నా ఆశీస్సులు అంటూ లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్-అమిత్ షా భేటీలో ఏం జరిగిందనే అంశంపై మాట్లాడేందుకు మాత్రం లక్ష్మీపార్వతి నిరాకరించారు. వారిద్దరి భేటీలో ఏం జరిగిందో తనను అడిగేతే ఏం చెప్తానంటూ సరదాగా ప్రశ్నించారు.

English summary
ysrcp leader lakshmi parvathi on today made interesting comments on junior ntr's political entry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X