ఎందుకూ కొరగాని కొడుకును జనంపై ఎందుకు రుద్దుతావు చంద్రబాబు
Lakshmi Parvathi: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన ఢిల్లీ పర్యటనపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి ఘాటు విమర్శలు చేశారు. పలు ఆరోపణలను సంధించారు.
పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు తాకట్టు పెడుతున్నాడంటూ లక్ష్మీపార్వతి విమర్శించారు. తన సొంత ప్రయోజనాల కోసం పార్టీని కనిపించిన ప్రతీ ఒక్కరి కాళ్ల దగ్గర తాకట్టు పెడుతున్నాడంటూ మండిపడ్డారు.

గతంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. అనంతరం ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి కాంగ్రెస్ కాళ్ల దగ్గర టీడీపీని తాకట్టు పెట్టాడని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ బీజేపీ పంచన చేరడానికి అవస్థలు పడుతున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీని అదే కాంగ్రెస్ కాళ్ల వద్ద ఉంచిన చంద్రబాబు.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నాడని ప్రశ్నించారు.
కేసుల భయంతో చంద్రబాబు బీజేపీతో పొత్తులు పెట్టుకోవడానికి తహతహలాడుతున్నాడని లక్ష్మీపార్వతి విమర్శించారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలవాలంటూ 20-25 సార్లు బ్రతిమిలాడుకుంటే తప్ప ఒక మధ్యవర్తి ద్వారా వారిని కలిశారనే ప్రచారం జరుగుతోందని ఆరోపించారు.
ఇలా అందరితోనూ పొత్తులు పెట్టుకుంటూ తెలుగుదేశం పార్టీని హీనమైన పరిస్థితికి చంద్రబాబు దిగజార్చాడని అన్నారు. మహోన్నతమైన విలువలతో ఎన్టీఆర్ నాడు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే చంద్రబాబు తన స్వార్థం కోసం వాడుకుంటున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా టీడీపీని స్థాపిస్తే తెలంగాణ ఎన్నికల్లో అదే కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు సపోర్ట్ చేశాడని చెప్పారు.

బీజేపీ హైకమాండ్‌కు చంద్రబాబు ఎంత డబ్బు అయినా ఇస్తానంటున్నాడని, అవసరమైతే టీడీపీని పూర్తిగా తీసేసుకోవాలనే ప్రతిపాదనలను సైతం ఉంచాడని, కేసుల నుంచి బయటపడేస్తే చాలని బీజేపీ పెద్దలను వేడుకుంటున్నాడని ఆరోపించారు. నారా లోకేష్ ఓ పనికిమాలిన వ్యక్తి అని, ఆయనను తీసుకొచ్చి ప్రజల మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడని చెప్పారు.
చంద్రబాబును ప్రజలు ఎంత అసహ్యించుకుంటున్నారనేది రా..కదలిరా పేరుతో నిర్వహిస్తోన్న బహిరంగ సభలను చూస్తే అర్థమౌతుందని లక్ష్మీపార్వతి చెప్పారు. టీడీపీ అనుకూల మీడియా కూడా నారా లోకేష్ మాదిరిగానే తయారైందని సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, మళ్లీ టీడీపీకి అధికారం దక్కడం కల్ల అని వ్యాఖ్యానించారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications