బోండా ఉమా వ్యవహారంలో కీలక మలుపు, తాజా నిర్ణయంతో..!!
ఎమ్మెల్యే బోండా ఉమా వ్యవహారం ఇప్పుడు టీడీపీలో కీలకంగా మారుతోంది. బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు.. వైసీపీ నేత అంబటితో కలిసి వేదిక పంచుకోవటం పైన సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారం పైన బోండాను పిలిచి మాట్లాడాలని నిర్దేశించారు. బోండా ఉమా సైతం ఇదే అంశం పైన తన సన్నిహితుల వద్ద కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ కోరితే వివరణ ఇస్తానని చెబుతున్నారు. దీంతో, బోండా నుంచి వివరణ తీసుకునేందుకు పార్టీ నాయకత్వం సిద్దమైంది. ఇందు కోసం కమిటీ ఏర్పాటైంది.
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా నుంచి వివరణ కోరాలని పార్టీ నిర్ణయించింది. ఇందు కోసం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ కమిటీ రేపు (మంగళవారం) రావాలని సమాచారం ఇచ్చింది. ముద్రగడ పద్మనాభం సంతాప సభలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వైసీపీ నేతలతో కలిసి వేదిక పంచుకోవటం పార్టీలో దుమారం రేపింది. దీని పైన సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శ లు మొదలయ్యాయి. దీని పైన సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ వ్యవహారంపై బొండా ఉమ వివరణ తీసుకోవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు లను చంద్రబాబు ఆదేశించారు. గుంటూరులో ముద్రగడ పద్మనాభం సంతాప సభ జరిగింది. ఈ కార్యక్రమంలో తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమ, వైసీపీ నేత అంబటి రాంబాబు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. విపక్ష నేతలతో వేదికలు పంచుకోవద్దని తెదేపా అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

కమిటీ ముందుకు బోండా ఉమా
కాగా.. ఇదే సమయంలో బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు సైతం పార్టీలో చర్చగా మారాయి. ముద్రగడ కారణంగానే 2019 లో పార్టీ ఓడిపోయిందనే వ్యాఖ్యల పైన పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, తాను వైసీపీ నిర్వహించిన సభకు వెళ్లలేదని... జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు హాజరయ్యనని బోండా ఉమా చెబుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో వైసీపీ నేత అంబటి కనిపిస్తే మర్యాదపూర్వకంగా పలకరించానని చెబుతున్నారు. అయితే.. వైసీపీ నేత జక్కంపూడి రాజా గోదావరి లో నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధ వచ్చిన విషయాన్ని బోండా ఉమా సన్నిహితులు గుర్తు చేస్తున్నారు. వీళ్ళని కూడా వివరణ అడుగుతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో.. ఇప్పుడు కమిటీ ఎదుట బోండా ఉమా ఏం చెబుతారు.. పార్టీ నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications