చదువుల వ్యవస్థను చెత్తబుట్టలో వేయండి: విద్యావ్యవస్థపై ఆర్జీవీ బాంబ్!
ఎలాంటి చర్చలోనైనా తనదైన శైలిలో రామ్ గోపాల్ వర్మ ఎల్లప్పుడూ ఓ ప్రత్యేక వైఖరిని తీసుకుంటారు. సమాజంలో ఆలోచనలను ప్రశ్నించడంలో ఆర్జీవీ ఎప్పుడూ ముందుంటారు. తన వివాదాస్పద కామెంట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఆర్జీవీ.. ఈ సారి విద్యావ్యవస్థ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంపై రామ్‌గోపాల్ వర్మ చేసిన కామెంట్లు నెట్టింట తీవ్ర చర్చకు దారితీశాయి.
ఎక్స్ వేదికగా ఆర్జీవీ స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ పేపర్ లీక్ వివాదం, విద్యార్థుల ఆత్మహత్యలు విద్యావ్యవస్థలోని తీవ్రలోపాలను బయటపెడుతున్నాయని అన్నారు. ఇవి భవిష్యత్తులో రాబోయే పెద్ద మార్పుకు సూచికలు మాత్రమేనని అభిప్రాయపడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఎంత వేగంగా మారుస్తుందో ఊహించలేమని, దాని ముందు మన సాంప్రదాయ విద్యా నమునాలు అంతకంతకూ కాలం చెల్లిపోయినవిగా మారుతున్నాయని రామ్‌గోపాల్ వర్మ స్పష్టం చేశారు.

ఆర్జీవీ వార్నింగ్
ప్రస్తుతం ఉన్నత విద్యను అభ్యసిస్తునన్ విద్యార్థులను ఉద్దేశించి ఆర్జీవీ హెచ్చరించారు. ముఖ్యంగా వైద్యం, ఇంజనీరింగ్, న్యాయశాస్త్రం, చార్టర్డ్ అకౌంటెన్సీ వంటి వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ వృత్తుల్లో మనుషులు చేసే క్లిష్టమైన పనిలో ఏఐ ఇప్పటికే అత్యంత సమర్థవంతంగా చేస్తోంది.. రానున్న కాలంలో ఆ డిగ్రీలకు ఉండే విలువ తగ్గిపోతుందని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. "వృద్ధులైన అజ్ఞానుల చేతిలో యువత భవిష్యత్తు నాశనం కాకముందే, ప్రతి ఒక్కరూ నడుం బిగించి ప్రస్తుత రూపంలో ఉన్న విద్యా వ్యవస్థను అంతం చేయాలి. విద్యార్థులను అత్యంత వేగంగా ఏఐ వైపు మళ్లించి, మిగతావన్నీ చెత్తబుట్టలో పడేయడమే వారి భవిష్యత్తుకు ఉన్న ఏకైక ఆశ." అంటూ రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆర్జీవీతో ఏకీభవించినా, ఏకీభవించకపోయినా ఆయన కామెంట్స్ కృత్రిమ మేధస్సు యుగంలో విద్యా భవిష్యత్తుపై ఓ కీలక చర్చకు దారితీశాయి. ఈ చర్చ కేవలం డిగ్రీలు సంపాదించడం నుంచి, రోజురోజుకు సాంకేతికతతో నడిచే ప్రపంచంలో రాణించడానికి అవసరమైన అనుకూలతను, నైపుణ్యాలను పెంపొందించుకోవడం వైపు మళ్లుతోంది.
NEET is not the issue
— Ram Gopal Varma (@RGVzoomin) July 27, 2026
A I is
NEET leaks, cancelled exams, student suicides might leave bodies on the floor and parents screaming which might seem brutal in the way the system is being injured
AI does not wound the system.
It rips its throat out.
For centuries education had one…
EDUCATION SHOULD BE KILLED
— Ram Gopal Varma (@RGVzoomin) July 27, 2026
Memorise. Write . Pass. Get degree. Get job. This was the formula paper thrust upon us , but now it is high time to tear it up
A medical student burns five years of his time doing MBBS, two years post graduation, then two or three more for…












Click it and Unblock the Notifications