ఆగస్టు నెలలో తిరుమలకు ప్లాన్ చేసుకున్నారా- TTD బిగ్ అప్డేట్..!!
తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. గత కొద్ది రోజులుగా ఎక్కువగా ఉన్న రద్దీ ప్రస్తుతం సాధారణ స్థితికి చేరుకుంది. వచ్చే నెలలో తిరిగి రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. కాగా.. ఆగస్టు నెలలో విద్యాసంస్థలకు సెలవులు ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో తిరుమలలో ఆగస్టు నెలలో నిర్వహించే విశేష పర్విదినాల జాబితాను టీటీడీ ప్రకటించింది.
శ్రావణ మాసం.. ఎక్కువ సెలవులతో వచ్చే నెల ఆగస్టులో తిరమలలో రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో, భక్తులకు ముందస్తు సమాచారంలో భాగంగా ఆగస్టు నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల జాబితాను టీటీడీ ప్రకటించింది. ఆగస్టు 14న తిరుమల శ్రీవారు పురిశైవారితోటకు వేంచేపు... ఆగస్టు 16న నాగ చతుర్థి, కశ్యప మహర్షి వర్ష తిరు నక్షత్రం నిర్వహించనున్నారు. అదే విధంగా ఆగస్టు 17న గరుడ పంచమి, శ్రీవారి గరుడ వాహన సేవ ఉంటాయని వెల్లడించారు. ఆగస్టు 21న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి నిర్వహించనున్నారు. ఆగస్టు 22న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేయనున్నట్లు తెలిపారు. ఆగస్టు 25న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాల సమాప్తి ఉండనుంది.

ఆగస్టు నెలలో తిరుమలలో ఇలా..
కాగా, ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి, శ్రీవారి గరుడ వాహన సేవ, శ్రీ విఖనసమహాముని జయంతి, శ్రీ హయగ్రీవ జయంతి నిర్వహించనున్నారు. ఆగస్టు 29న తిరుమల శ్రీవారు విఖనసాచార్యుల వారి సన్నిధికి వేంచేపు ఉండనుంది. కాగా..తిరుమలలో వాహనాల పైన టీటీడీ కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది. సొంత వాహనాలతో వచ్చే యాత్రికులు.. జీపులు, క్యాబులు హారన్ వాడకుండా సూచనలు చేస్తోంది. ఈ నిబంధనను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ, భారీ జరిమానాలు విధించాలని నిర్ణయించారు. తిరుమలలోని జీఎన్‌సీ టోల్‌గేట్ నుంచి రెండు ఘాట్ రోడ్లతో సహా కొండపై అన్ని ప్రాంతాల్లో ఈ నిబంధన వర్తిస్తుంది. ఎప్పటి నుంచో ఈ రూల్ అమల్లో ఉన్నప్పటికీ, చాలామంది వాహనదారులు దీన్ని పట్టించుకోకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ చర్యలు తీవ్రతరం చేశారు. ఇందు కోసం తిరుమల వ్యాప్తంగా రెండు వేలకుపైగా సీసీ కెమెరాల ద్వారా పోలీస్ కమాండ్ కంట్రోల్ విభాగం నిరంతరం పర్యవేక్షిస్తుంది.












Click it and Unblock the Notifications