వైసీపీ ఇంఛార్జ్ ల మార్పు పై సజ్జల కీలక వ్యాఖ్యలు..!!

చంద్రబాబు, పవన్ కల్యాణ్ పైన వైసీపీ ముఖ్య నేత సజ్జల కీలక వ్యాఖ్యలు చేసారు. అదే సమయంలో వైసీపీ ఇంఛార్జ్ ల మార్పు పైన స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు కొత్త పార్టీ తరహాలో ఇప్పుడు హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. జన్మభూమి కమిటీ పేరు వినగానే జనానికి భయం పడుతోందన్నారు. పవన్, చంద్రబాబుకు ఏపీలో అడ్రస్ లేదని విమర్శించారు. వైసీపీ హాయంలో ఇచ్చిన ఉద్యోగాల గురించి సజ్జల వివరించారు.

పవన్ కల్యాణ్ రాకపోతే తమ మీటింగ్ కు జనం రారనే స్థితికి చంద్రబాబు వెళ్లారని సజ్జల వ్యాఖ్యానించారు. సీఎం జగన్ అహంకారి అని ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. జగన్ అహంకారి అయితే ప్రజల మనసులో ఎలా ఉంటారని ప్రశ్నించారు. ఈ నాలుగున్నారేళ్లుగా సీఎం జగన్ సంక్షేమం చేయగలిగారని చెప్పుకొచ్చారు.

Sajjala targets Chandra Babu and Pawan Kalyan over Election promises, and on Alliance

చంద్రబాబు పాలనలో ఏం చేసారో చెప్పాలని నిలదీసారు. చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితితో లేరన్నారు. 2014-19 మధ్య చంద్రాబు తెచ్చిన స్కీములు ఉన్నాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు - పవన్ మధ్య అప్పుడు కమ్యూనికేషన్ ఎందుకు వచ్చిందోనని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మళ్లీ ఎందుకు కలిసారో చెప్పాలన్నారు.

చంద్రబాబు, పవన్ మధ్య తెర వెనుక జరిగిన ఒప్పందాలను ప్రజలకు వివరించాలని డిమాండ్ చేసారు. చంద్రబాబు అండ్ మద్దతు మీడియా మినహా ప్రజలెవరు జగన్ ను మార్చాలని అనుకోవటం లేదన్నారు. చంద్రబాబుకు దీర్ఘకాలిక మద్దతు అని పవన్ అంటున్నారని..మరి సొంతంగా పార్టీ పెట్టుకోవటం ఎందుకని ఎద్దేవా చేసారు.

పవన్ వెనుక ఉన్నవారు చంద్రబాబును సీఎం చేయాలని ఎందుకు అనుకుంటారని సజ్జల ప్రశ్నించారు. అధికారం ఒక హక్కుగా చంద్రబాబు ఇంకా అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తాము 175 నియోజకవర్గాల్లో పర్ఫెక్ట్ టీంతో వెళ్తున్నామని..తమ పార్టీ నుంచి ఎవరూ పక్కకు వెళ్లే అవకాశం లేదని సజ్జల తేల్చి చెప్పారు. టీడీపీ, జనసేన మధ్యనే పొంతన సరిగా లేదని..బీజేపీని కలపాలని ఎందుకు అనుకుంటారని సజ్జల వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+