వైసీపీకి షాక్: టిడిపిలో చేరిన సుబ్రమణ్యం రెడ్డి, చక్రం తిప్పుతున్న మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి

అమరావతి: చిత్తూరు మాజీ జడ్పీ ఛైర్మెన్, మాజీ వైసీపీ నేత ఎం. సుబ్రమణ్యం రెడ్డి, టిడిపిలో చేరారు.సోమవారం నాడు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో సుబ్రమణ్యం రెడ్డి టిడిపి తీర్థం పుచ్చుకొన్నారు.

చిత్తూరు జిల్లాలో వైసీపీ అధిపత్యాన్ని నిలువరించేందుకు టిడిపి ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగానే కుప్పం నియోజకవర్గానికి చెందిన సుబ్రమణ్యం రెడ్డి టిడిపిలో చేరారు.

వైసీపీకి బాగా పట్టున్న జిల్లాల్లో ఆ పార్టీని బలహీనపర్చేందుకుగాను టిడిపి నాయకత్వం ఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగానే వైసీపీకి గట్టి పట్టున్న నేతలను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టిడిపిలో ఆహ్వనిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి ఏపీ రాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్‌కుమార్ టిడిపిలో చేరారు తాజాగా సుబ్రమణ్యంరెడ్డి టిడిపిలో చేరారు.

వైసీపీకి షాకిచ్చిన సుబ్రమణ్యంరెడ్డి

వైసీపీకి షాకిచ్చిన సుబ్రమణ్యంరెడ్డి

చిత్తూరు జిల్లాలో వైసీపీకి సుబ్రమణ్యం రెడ్డి షాకిచ్చారు. వైసీపీకి రాజీనామా చేసిన సుబ్రమణ్యం రెడ్డి టిడిపిలో చేరారు. కుప్పం నియోజకవర్గం నుండి తన అనుచరులతో కలిసి సుబ్రమణ్యం రెడ్డి టిడిపిలో జనవరి29వ, తేదిన చేరారు. వైసీపీని దెబ్బకొట్టే లక్ష్యంతో చిత్తూరు జిల్లా నుండి మంత్రివర్గంలో చోటు దక్కించుకొన్న అమర్‌నాథ్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు. ఈ మేరకు సుబ్రమణ్యం రెడ్డి టిడిపిలో చేరారు.

చిత్తూరులో చక్రం తిప్పుతున్న అమర్ నాథ్ రెడ్డి

చిత్తూరులో చక్రం తిప్పుతున్న అమర్ నాథ్ రెడ్డి

చిత్తూరు జిల్లాలో వైసీపీ నుండి టిడిపిలో చేరిన అమర్‌నాథ్ రెడ్డి మంత్రి వర్గంలో చంద్రబాబునాయడు చోటు కల్పించారు. మంత్రి అమర్‌నాథ్ రెడ్డి చిత్తూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో వ్యూహలను రచిస్తున్నారు. 2014 ఎన్నికల ముందు వరకు టిడిపిలోనే ఉన్న అమర్‌నాథ్ రెడ్డి ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఎన్నికల్లో వైసీపీ తరపున పలమనేరు నుండి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. రెండేళ్ళ క్రితం అమర్‌నాథ్ రెడ్డి టిడిపిలో చేరారు. గత ఏడాది ఏప్రిల్‌లో అమర్‌నాథ్ రెడ్డికి చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో చోటు కల్పించారు. చిత్తూరులో వైసీపీ ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు టిడిపి పావులు కదుపుతోంది. క్షేత్రస్థాయి నుండి ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అభ్యర్థుల వరకు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వల వేస్తోంది. మంత్రి అమర్ నాథ్ రెడ్డి చక్రం తిప్పుతున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

కిషోర్ కుమార్ రెడ్డి చేరికతో మారుతున్న సమీకరణాలు

కిషోర్ కుమార్ రెడ్డి చేరికతో మారుతున్న సమీకరణాలు

చిత్తూరు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిర‌ణ్‌కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టిడిపిలో చేరిన తర్వాత జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. చిత్తూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కిషోర్‌కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరాలను కిషోర్ కుమార్ రెడ్డి చూసుకొనేవారు. తమ వర్గాన్ని తిరిగి టిడిపిలో చేర్చేలా కిషోర్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామాలు రాజకీయంగా తమకు కలిసొస్తాయని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి.

Recommended Video

    జగన్ @1000 : మరీ ఇన్ని మోసాలా, చంద్రబాబు పై నిప్పులు
    పాత,కొత్త కలయిక సాధ్యమేనా

    పాత,కొత్త కలయిక సాధ్యమేనా

    ఇప్పటివరకు టిడిపికి వ్యతిరేకంగా ఉన్న నేతలంతా ప్రస్తుతం టిడిపిలో చేరడంతో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల మధ్య సమన్వయం కత్తి మీద సాముగానే మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇతర పార్టీల్లో ఉన్న నేతలకు వ్యతిరేకంగా పనిచేసి ప్రస్తుతం వారి నాయకత్వం కింద పనిచేయాలంటే కాస్త ఇబ్బందిగానే మారిందని క్షేత్రస్థాయిలో టిడిపి కార్యకర్తలు ఆవేదనను చెందుతున్నారు. ఈ తరుణంలో పార్టీ అవసరాల రీత్యా చేరికలు అనివార్యమని టిడిపి నాయకత్వం తేల్చి చెబుతోంది. అయితే టిడిపిలోని అసంతృప్త నేతలను తమ వైపుకు తిప్పుకొనేందుకు వైసీపీ నాయకత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+