2024లో చివరి గంట పోలింగ్, ఏం జరిగింది - ఢిల్లీలో కీలక పరిణామాలు..!!
2024 ఎన్నికల పోలింగ్ లో ఈవీఎం ల పని తీరుపైన పెద్ద ఎత్తున రాజకీయ చర్చ జరిగింది. ఇదే అంశం పై వైసీపీ నేతలు ఫిర్యాదులు చేసారు. పలు రకాల సందేహాలు వ్యక్తం చేసారు. పలు దేశా ల్లో బ్యాలెట్ పేపర్ వినియోగిస్తున్న విధానం పైన మాజీ సీఎం జగన్ అనేక సందర్భాల్లో ప్రస్తావన చేసారు. ఇక, ఈవీఎంల పనితీరుపై ఎన్నికల కమిషన్‌కు వైయస్ఆర్‌సీపీ బృందం ఫిర్యాదు చేసింది. దీంతో, ఈ అంశాలపై వివరణ ఇచ్చేందకు వైసీపీ టీంను ఈసీ ఆహ్వానించింది. కీలక అంశాల పైన చర్చ జరిగింది.
ఈసీకి ఫిర్యాదులు
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, పార్టీ నేత లోకేష్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యింది. గతంలో ఈవీఎంల పనితీరుపై ఎన్నికల కమిషన్‌కు వైసీపీ బృందం ఫిర్యాదు చేసింది. దీంతో, ఈ అంశా పై వివరణ ఇచ్చేందకు వైసీపీ టీంను ఈసీ ఆహ్వానించింది. కాగా, ఈసీ దృష్టికి పలు కీలక అంశాలను తీసుకెళ్లినట్టు పార్టీ నేతలు తెలిపారు. 2024 ఎన్నికల్లో చివరి గంటల్లో అకస్మాత్తుగా పోలింగ్ శాతం పెరగడం, అసాధారణంగా ఓటర్లు పెరగడం తదితర అంశాలను ఈసీ దృష్టికి నేతల బృందం తీసుకెళ్లింది. ఈవీఎంల పనితీరుపై ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో అసాధారణంగా ఓటర్లు పెరగడంపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు పార్టీ నేతలు వెల్లించారు.

ఇలా జరిగిందీ
ఈవీఎంలపై ఉన్న టెక్నికల్ అనుమానాలపై ఈసీకి వివరించాం. గత ఎన్నికల్లో చివరి గంటలో పోలింగ్ శాతంపై వివరణ కోరినట్లు చెప్పారు. కేంద్ర సంఘం ఆహ్వానం మేరకు తాము వచ్చామని.. ఓటర్ లిస్టు, పోలింగ్ సరళి వంటి అంశాలపై చర్చించామని వెల్లడించారు. 2024 ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని.. వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని ఈసీకి వివరించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల ఓట్లకు, వీవీప్యాట్లను పోల్చి చూడాలని చెప్పినట్లు వెల్లడించారు. ఈవీఎంలలో బ్యాటరీలపైన కూడా సందేహాలు ఉన్నాయన్నారు ఏపీలో సాయం 6 గంటల తర్వాత ఎక్కువ నియోజకవర్గాలలో పోలింగ్ శాతం పెరిగిందని ఈసీకి వివరించారు.
విచారణ చేయండి
ఆరు తర్వాత జరిగిన పోలింగ్‌లో దాదాపు 50 లక్షలు ఓట్లు పోలయ్యాయయని.. దీనిపై ఎంక్వైరీ చేయాలని వైసీపీ నేతలు కోరారు. విజయనగరం పార్లమెంట్ ఎన్నికలలో ఈవీఎం ఓట్లు, వీవీప్యాట్ కంపారిజన్ చేయమని కోరారు. కానీ, వీవీప్యాట్ల కంపారిజన్ చేయమని ఈసీ తెగేసి చెప్పింది. సీసీ టీవీ ఫుటేజ్ విడుదల చేయాలని అడిగితే నిరాకరించారని సుబ్బారెడ్డి వెల్లడించారు. రాయచోటిలో ఓటర్ల సంఖ్య చాలా పెరిగిందని గుర్తు చేసారు. బీహార్ తరహాలో ఏపీలో కూడా స్పెషల్ ఇంటెన్సిఫై రివిజన్ చేయాలని కోరినట్లు వివరించారు. ఇందుకు ఈసీ ఒప్పుకుందని చెప్పారు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం 38వ పోలింగ్ బూత్‌లో అసెంబ్లీ, పార్లమెంట్‌కు భిన్నమైన పోలింగ్ నమోదు అయ్యిందని వివరించారు. వచ్చే ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరగాలని కోరారు.












Click it and Unblock the Notifications