చంద్రబాబు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారబ్బా..!

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు పని చేస్తున్నారు. ఈ ఎన్నికలు చంద్రబాబుకు చావో రేవో వంటివి. గత ఎన్నికల్లో దారుణ ఓటమి తరువాత కుదేలైన పార్టీని మళ్లీ ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా ఓడిపోతే చంద్రబాబు రాజకీయంగా తెరమరుగు కావడం ఖాయం. అందుకే ఆయన వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నారు. ఒంటరిగా వెళ్తే జగన్‌ను ఓడించడం కష్టమని భావించిన చంద్రబాబు.. బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఫుల్ జోష్ ఉన్న టీడీపీ అధ్యక్షుడు ..ఈక్రమంలోనే తన సొంత నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు.

సోమవారం కుప్పంలో పర్యటించిన చంద్రబాబు స్థానిక మహిళలతో కాసేపు ముచ్చటించారు. టీడీపీ అధికారంలోకి రాగానే పింఛన్ నాలుగు వేలు చేస్తామని ప్రకటించారు. ఆయన అక్కడితో ఆగకుండా ఒకటో తేదీనే పింఛన్ మీ ఇంటికి ఇస్తామని తెలిపారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఒకటో తేదీనే పింఛన్ ఇంటికి తీసుకువచ్చి మరీ ఇస్తున్నారు.ఇందులో చంద్రబాబు కొత్తగా ఇచ్చేది ఏముందని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.

Ysrcp leaders corner on chandrababu over pension increase

ఇక ఇంటికే పింఛన్ ఇస్తామని చెప్పిన చంద్రబాబు..అది ఎలా ఇస్తారనేది మాత్రం వెల్లడించలేదు. వైసీపీ సర్కార్ వాలంటీర్ల చేత వృద్దులకు, ఒంటరి మహిళలకు ప్రతి నెల ఒకటో తేదీనే పింఛన్ అందిస్తోంది. మరి టీడీపీ ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తుందో చెప్పలేదని వైసీపీ నేతలు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు.గతంలో వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అయితే ఓ అడుగు ముందుకేసి గోనె సంచులు మోసుకునే ఉద్యోగం అంటూ వాలంటీర్ వ్యవస్థను కించపరిచారు.

ఇప్పుడు ఎన్నికల్లో లబ్ధి పొందడానికే తాము అధికారంలోకి వచ్చినా వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ఇక పింఛన్ రూ.4 వేలు పెంచుతామని చంద్రబాబు ప్రకటనలో కొత్తదనం లేదని సామాన్య ప్రజలు సైతం పెదవి విరుస్తున్నారు. జగన్ ఎన్నికల్లో హామీల్లో పింఛన్ పెంపుదల కూడా ఒకటని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇందులో చంద్రబాబు కొత్తగా చెప్పింది ఏమీ లేదంటున్నారు. మొత్తానికి పింఛన్ పెంపుదలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీని ఇరాకటంలో పెట్టేలా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.మరి దీనిపై టీడీపీ శ్రేణలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+