పవన్ కళ్యాణ్ తర్వాత వైసీపీ నేతల పోలవరం టూర్, బాబుపై నిప్పులు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. వారు అధికారులను ప్రాజెక్టు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు ప్రశ్నలు వేసి వారి నుంచి సమాధానాలు రాబట్టారు.

పవన్ కళ్యాణ్! దాని గురించి మాట్లాడు: రోజా దిమ్మతిరిగే షాక్, వాణీ విశ్వనాథ్‌పై సై

అనంతరం వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. స్పిల్ వే పనులు ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. పోలవరం పూర్తయితేనే రాష్ట్రం అన్నపూర్ణగా మారుతుందని చెప్పారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు.

YSRCP leaders visit Polavaram Project

పోలవరం విషయంలో ప్రజలను మభ్యపెట్టవద్దన్నారు. ప్రాజెక్టు విషయంలో ప్రజలను మోసం చేయడం ముఖ్యమంత్రికి తగదని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యంపై ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని సూచించారు. ఈ ప్రాజెక్టు గురించి పార్లమెంటులో ప్రస్తావిస్తామని చెప్పారు.

మీపై నాకు అనుమానం వస్తోంది, తప్పు చేయకుంటే లెక్క చెప్పొచ్చుగా: బాబుకు పవన్ కళ్యాణ్ షాక్

పోలవరం ప్రాజెక్టు కోసం వైయస్ హయాంలో రూ.4700 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. పోలవరం అనుమతులు అన్నీ వైయస్ రాజశేఖర రెడ్డియే తీసుకు వచ్చారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సింది కేంద్రమే అన్నారు.

రాష్ట్రం ఇప్పటికే చాలా నష్టపోయిందని, ఇప్పటికైనా పోలవరం పూర్తి చేయాలనిచెప్పారు. కేవలం కాంట్రాక్టుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం ముందు చంద్రబాబు తాకట్టు పెట్టారన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్లాక వైసీపీ నేతలు పర్యటించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress party leaders visited Polavaram Project on Thursday after Jana Sena chief Pawan Kalyan tour.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి