చంద్రబాబు ఓటమి పక్కా - లెక్క తేలిందిలా..!!

ఏపీలో ఎన్నికల ఫలితాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీలు ధీమాగా కనిపిస్తున్నా..లోలోపల టెన్షన్ నెలకొంది. ముఖ్యమంత్రి జగన్ 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసారు. టీడీపీ మద్దతు దారులు గెలుపు తమదేనని చెబుతున్నా...చంద్రబాబు క్యాంపు మాత్రం మౌనంగా ఉంది. ఇదే సమయంలో చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో వైసీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు లెక్కలు చెబుతున్నారు. వైసీపీ గెలుపు ఖాయమని ధీమాగా ఉన్నారు.

కుప్పంలో ఉత్కంఠ
ఏపీలో ఎన్నికల ఫలితాల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కుప్పంలో వైసీపీ విజయం ఖాయమని ఆ పార్టీ ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలోనే వైసీపీ కుప్పం పైన ఫోకస్ చేసింది. ఆ ఎన్నికల కౌంటింగ్ లో తొలి రెండు రౌండ్లలో చంద్రబాబు వెనుకంజలో ఉన్నారు. తరువాత పుంజుకొని విజయం సాధించారు. ఈ సారి ఎన్నికల కోసం వైసీపీ కుప్పంలో చాలా కాలంగా పక్కా ప్లాన్ తో ముందుకు వెల్లింది.కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. ఆ తరవాత చంద్రబాబు ప్రతీ మూడు నెలలకు మూడు రోజులు పాటు కుప్పంలో పర్యటించారు. అక్కడే ఇంటి నిర్మాణం ప్రారంభించారు.

YSRCP leadership Confident over Winning Chandra Babu contesting seat Kuppam see deets

వైసీపీ ధీమా వెనుక
జగన్ కుప్పంలో ముందుగానే తమ అభ్యర్దిని ప్రకటించి..ఎమ్మెల్సీ చేసారు. కుప్పం ను రెవిన్యూ డివిజన్ చేయటం.. క్రిష్ణా జలాలు, స్థానిక అంశాల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. కుప్పం బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పోలింగ్ ముందు రోజు వరకు వైసీపీ ప్రత్యేక వ్యూహాలు అమలు చేసింది. టీడీపీ నుంచి కౌంటర్ స్కెచ్ అమలు చేసారు. పోలింగ్ నాడు కుప్పంలో 2014లో 85.47 పోలింగ్ నమోదు కాగా..ఈ సారి 89.88 శాతం నమోదైంది. అయితే..కుప్పంలో ఓటింగ్ సరళి గురించి మంత్రి పెద్దిరెడ్డి ప్రత్యేకంగా సీఎం జగన్ కు నివేదిక ఇచ్చారు. తాజాగా కుప్పం పోలింగ్ సరళి తరువాత వైసీపీ గెలుస్తామని చెబుతున్నా..టీడీపీ నుంచి కౌంటర్ లేదు.

YSRCP leadership Confident over Winning Chandra Babu contesting seat Kuppam see deets

చంద్రబాబు ఓటమి ఖాయమా
వైసీపీ అనుకూల ఓటింగ్ ఎక్కువ ఉందని మండలాల వారీగా మంత్రి పెద్దిరెడ్డి, సర్వే సంస్థలు లెక్కలు ఇచ్చినట్లు సమాచారం. కుప్పం మున్సిపాల్టీలో రెండు పార్టీల మధ్య వచ్చిన ఓట్లు ఇప్పుడు ఫలితంలో కీలకంగా మారుతుందనే అంచనాలు ఉన్నాయి. కుప్పం నుంచి చంద్రబాబు వరుసగా ఏడు సార్లు విజయం సాధించారు. ఈ సారి గెలిస్తే 8వ సారి వరుస విజయం గా నమోదు కానుంది. కానీ, వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు కుప్పంలో ఓడుతున్నారని జోస్యం చెబుతున్నారు. అదే విధంగా పోలింగ్ సరళి పైన పూర్తి కసరత్తు చేసిన తరువాతనే తాము ఈ విషయం చెబుతున్నామని వెల్లడించారు. దీంతో,. వైసీపీ లెక్క పక్కాగా చెబుతున్న వేళ..కుప్పం ఫలితం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+