పవన్ వర్సస్ ముద్రగడ, గోదావరి గట్టున హోరా హోరీ - గెలుపెవరిది..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సామాజిక లెక్కలు కీలకం అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న పవన్ తనకు పట్టున్న గోదావరి జిల్లాల నుంచి యాత్ర ప్రారంభించారు. టీడీపీ, పవన్ కలిసి కీలమైన జిల్లాల్లో తనను దెబ్బ తీసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సీఎం జగన్ కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. ఇప్పుడు అనూహ్యంగా ముద్రగడ రంగంలోకి దిగారు. పవన్ ను టార్గెట్ చేసారు. ఇప్పుడు గోదావరి గట్టున కాపు రాజకీయం కాక రేపుతోంది.
పవన్ కు ముద్రగడ లేఖ : జనసేనాని పవన్ ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా రాజకీయం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకు సిద్దమయ్యారు. ఏపీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా గోదావరి జిల్లాలే కీలకం. ఉభయ గోదావారి జిల్లాల్లో ఎవరు గెలవాలన్నా అక్కడి సామాజిక సమీకరణాలదే కలక పాత్ర. ఈ సమయంలో కాపు ఓటింగ్ ఎవరి వైపు అనే చర్చ మొదలైంది.

ఈ సారి కాపు మెజార్టీ ఓటింగ్ పవన్ వైపు ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఈ సమయంలోనే కాపు ఉద్యమ నేత ముద్రగడ రంగంలోకి వచ్చారు. పవన్ లక్ష్యంగా వరుస లేఖలు సంధిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి తన పైన పోటీకి సిద్దమవ్వాలని సవాల్ చేసారు. ఇప్పటి వరకు పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం నడుమ ఇప్పుడు ముద్రగడ సవాల్ కీలకంగా మారుతోంది.
పిఠాపురంలో ఇద్దరి పోటీ : కాపు ఉద్యమ నేత ముద్రగడ వైసీపీలో చేరుతారంటూ కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. తాజాగా పవన్ కు రాసిన లేఖలోనూ ముద్రగడ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే ఆలోచన ల మధ్య ఉన్న తనను మరోసారి ఎన్నికల్లోకి దిగేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఇందుకు ముద్రగడ పిఠాపురం నియోజకవర్గం ఎంపిక చేసుకున్నారు.
దీంతో..పవన్ అదే నియోజకవర్గం వైపు చూస్తున్నారనే ప్రచారంతో ఈ ఇద్దరే పోటీకి దిగితే ఫలితం ఎలా ఉంటుందనే ఆసక్తి కర చర్చ మొదలైంది. ముద్రగడ పద్మానాభం పిఠాపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా 2009లో పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో 43,431 ఓట్లు దక్కించుకున్నారు. 2009లో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం అభ్యర్ధిగా పోటీ చేసిన వంగా గీత గెలుపొందారు.

హోరా హోరీ..గెలిచేదెవరు : 2019లో దొరబాబు గెలుపొందారు. 2019లో ఇక్కడ పోటీ చేసిన జనసేన అభ్యర్దికి 28011 ఓట్లు దక్కాయి. గోదావరి జిల్లాల్లో పిఠాపురం కాపు ఓటింగ్ కు కంచుకోట. పవన్ కల్యాణ్ ఇదే నియోజకవర్గంలో ఇల్లు తీసుకోవాలని నిర్ణయించటం ద్వారా ఇక్కడ నుంచే బరిలోకి దిగేందుకు నిర్ణయించారనే అంచనాలు పెరిగాయి. ముద్రగడ వైసీపీ నుంచి పోటీ చేస్తారా..స్వతంత్రంగా దిగుతారా అనేది కీలక అంశం.
పవన్ పైన ముద్రగడ వైసీపీ నుంచి పోటీ చేస్తే పోటీ ఉత్కంఠ పెంచటం ఖాయం. టీడీపీతో పొత్తు ఖాయమైతే పవన్ కు మరింత బలం పెరిగే అవకాశం ఉంది. పిఠాపురంలో ముద్రగడకు గట్టి పట్టు ఉంది. కాపు సామాజిక వర్గం ఇక్కడ గెలుపు ఓటములను డిసైడ్ చేసే పరిస్థితి కావటంతో పవన్ వర్సస్ ముద్రగడ పిఠాపురంలో తలపడితే గెలుపెవరది అనేది చివరి నిమిషం వరకు ఉత్కంఠ తప్పదు.












Click it and Unblock the Notifications