ఆ ఫిర్యాదుతో ఇబ్బందుల్లో మామా అల్లుడు
Nandamuri Balakrishna, Nara Lokesh: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతమైంది. అన్ని పార్టీలు ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకోనున్నాయి. మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తోన్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజాగళం పేరుతో రోడ్ షోలను చేపట్టారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు.
అటు పోలింగ్ గడువు సమీపిస్తోంది. రేపు నోటిఫికేషన్ వెలువడుతుంది. ఆ వెంటనే నామినేషన్ల పర్వం ఆరంభమౌతుంది. నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల 25. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి 29వ తేదీ వరకు గడువు ఉంటుంది. మే 13వ తేదీన పోలింగ్.

రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకరవర్గాలకు ఒకే రోజున పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎన్నికల ప్రచార తీవ్రత పెరుగుతున్న కొద్దీ నాయకులు, అభ్యర్థుల మధ్య వాగ్వివాదం పతాక స్థాయికి చేరుకుంటోంది. మాటల దాడులు సాగుతున్నాయి. ఇవి కాస్తా శృతిమించుతున్నాయి.
వైఎస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే, హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్‌పై బాలయ్య అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈసీకి వివరించారు. నువ్వు పోతావు.. పోయే కాలం వచ్చింది.. అంటూ జగన్‌పై బాలకృష్ణ వ్యాఖ్యలు చేశారని చెప్పారు.
మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న మాజీ మంత్రి నారా లోకేష్‌పైనా వైసీపీ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ ద్వారా వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా పాట ప్రసారం చేశారని వారు నారా లోకేష్‌పై ఫిర్యాదు చేశారు. ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications