పార్టీ జెండా మోస్తాం.. అంతే గానీ: పేర్ని నాని సంచలన కామెంట్స్

Perni Nani: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలను మార్చడం, కొత్తవారికి బాధ్యతలను అప్పగించడం.. రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించింది. ఇంకో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఈ మార్పు మున్మందు మరిన్ని సంచలనాలను తెర తీయడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రత్తిపాడు- బాలసాని కిరణ్ కుమార్, కొండెపి- ఆదిమూలపు సురేష్, వేమూరు- వరికూటి అశోక్ బాబు, తాడికొండ- మేకతోటి సుచరిత, సంతనూతలపాడు- మేరుగ నాగార్జున, చిలకలూరిపేట- మల్లెల రాజేశ్ నాయుడు, గుంటూరు పశ్చిమ- విడదల రజినీ, అద్దంకి- పాణెం హనిమిరెడ్డి, మంగళగిరి- గంజి చిరంజీవి, రేపల్లె- ఈవూరు గణేష్, గాజువాక- వరికూటి రామచంద్రరావు అపాయింట్ అయ్యారు.

YSRCP MLA and Former Minister Perni Nani made key remarks

ఈ పరిణామాలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. పార్టీలో మార్పులు- చేర్పులు అత్యంత సహజమేనని, దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా గెలుపు కోసం ఇలాంటి వ్యూహాలు పన్నుతుంటుందని, మేలు చేసే నిర్ణయాలను తీసుకుంటుందని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పని చేస్తోన్నారని పేర్ని నాని గుర్తు చేశారు. క్షేత్రస్థాయి నుంచి అందిన సర్వే నివేదికలు, పార్టీ శ్రేణుల అభిప్రాయాల మేరకే ఈ మార్పులు జరిగాయని తాను భావిస్తున్నట్లు వివరించారు. టికెట్ల కేటాయింపులో ఎంపీలు, ఎమ్మెల్యకే అధిక ప్రాధాన్యత ఉంటుందని పేర్నినాని స్పష్టం చేశారు.

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని పేర్ని నాని తేల్చి చెప్పారు. తనకు బదులుగా ఇంకెవరికి టికెట్ ఇచ్చినా కూడా వారి కోసం కష్టపడి పని చేస్తానని, మచిలీపట్నంలో పార్టీ జెండాను ఎగురవేస్తామని అన్నారు. 175కు 175 స్థానాలను గెలవడం కోసం ఎంతవరకైనా పోరాడతామని చెప్పారు.

తన తనయుడు పేర్ని కిట్టుకు టికెట్‌ ఇవ్వాలని తాను ఇంత వరకు జగన్‌ను కోరలేదని పేర్ని నాని అన్నారు. 175 నియోజకవర్గాల్లో నిలబెట్టే అభ్యర్థుల్లో కిట్టు కూడా ఒకడిగా ఉంటాడని భావిస్తేనే జగన్ టికెట్‌ ఇస్తారని అన్నారు. కిట్టుకు కాకుండా ఇంకెవరికి టికెట్‌ ఇచ్చినా పార్టీ జెండా మోయడానికి తాను సిద్ధంగా ఉన్నానని పేర్ని నాని తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+