జగన్ అలా అన్నారట ! రాజకీయాలు వదిలేస్తానన్న బాలినేని-ఉద్యోగ నేతకు ఎమ్మెల్సీ పదవి..!

ఏపీలో ఈ మధ్య నిత్యం సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న వైసీపీ మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవాళ మరిన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒంగోలులో ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు ఎంపీ మాగుంటకు మరోసారి సీటు విషయంలో తాజాగా సీఎం జగన్ వద్ద పట్టుబట్టిన బాలినేని వార్తల్లో నిలిచారు. అంతే కాదు ఈ రెండు అంశాలపై అలిగి హైదరాబాద్ వెళ్లిపోయి అక్కడే ఉండిపోయారు కూడా. ఇప్పుడు దానిపై సీఎం జగన్ స్పందించిన విధానంపై బాలినేని మరోసారి రియాక్ట్ అయ్యారు.

సీఎం జగన్ ఈ మధ్య ఇంటెలిజెన్స్ వర్గాలతో మాట్లాడుతూ తాను గట్టిగా అడుగుతున్నానని అంటున్నారని బాలినేని వెల్లడించారు. కానీ తాను అలిగింది ప్రజల కోసమే అన్నారు. రాజకీయాల్లో సర్దుకుపోవడం వల్లే తాను ఇబ్బందులు పడుతున్నానని, అవసరమైతే రాజకీయాలకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమని బాలినేని ప్రకటించారు. కానీ సీఎంకు వాస్తవాలు చెప్పి తీరాలనే తాను అలా స్పందించినట్లు చెప్పుకొచ్చారు.

ysrcp mla balineni srinivasa reddy annoyed on ys jagan comments, fight for mlc to employee leader

మరోవైపు రాష్ట్రంలో ఉద్యోగులు వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారని కూడా తాను సీఎం జగన్ కు చెప్పినట్లు బాలినేని వెల్లడించారు. ఐదేళ్లలో ఎన్జీవోలు చాలా ఇబ్బందులు పడ్డారని, కాబట్టి వారి పీఆర్సీ విషయంలో సీఎంతో చర్చలు జరిపినట్లు బాలినేని తెలిపారు. కానీ ఉద్యోగులకు అన్ని ప్రయోజనాలు త్వరలోనే అందుతాయన్నారు. అలాగే ఎన్జీవోల నేత బండి శ్రీనివాసరావుకు ఎమ్మెల్సీ ఇచ్చేలా సీఎం జగన్ దగ్గర పోరాడతానని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+