జగన్‌కు ఝలక్: చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే ప్రశంసలు, వైయస్సార్‌పై విమర్శలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఝలక్. వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు.
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఝలక్. వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు.

బాబును మెచ్చుకున్న వైసీపీ ఎమ్మెల్యే
వైసీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాబును మెచ్చుకున్నారు. ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీ ప్లస్ త్రీ ఇళ్ల నిర్మాణాన్న మెచ్చుకున్నారు.

ఇందిరమ్మ ఇళ్లు కూలిపోతున్నాయి
అంతేకాదు, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలో సదుపాయాలు సరిగ్గా లేవని వ్యాఖ్యానించారని తెలుస్తోంది. ఆ ఇళ్లు కూలిపోతున్నాయని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం నిర్మిస్తున్న జీ ప్లస్ త్రీ ఇళ్ల నిర్మాణం బాగుందన్నారు.

గతంలో టీడీపీపై విమర్శలు ఇలా
కాగా, తాము టీడీపీలో చేరితో భారీ మొత్తం ఇస్తామని అధికార పార్టీ నేతలు ఆఫర్ చేశారని గత ఏడాది సాయిప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను, తన సోదరుడు ప్రలోభాలకు లొంగే వ్యక్తులం కాదన్నారు.

వ్యాఖ్యలు ఆసక్తికరం
ఇదిలా ఉండగా నంద్యాల ఉప ఎన్నికల అనంతరం, జగన్ పాదయాత్ర సమయంలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతారని భావించారు. ఒకరు ఇద్దరు చేరారు. కానీ ఊహించినంత స్పందన రాలేదు.












Click it and Unblock the Notifications