కూతురికి ఆదర్శ వివాహం చేయించిన వైసీపీ ఎమ్మెల్యే-రిజిస్టార్ కార్యాలయంలో స్వయంగా..
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇవాళ తన కుమార్తెకు ఆదర్శ వివాహం చేయించారు. కులం,మతం, ప్రాంతం చూడని తన పార్టీ వైసీపీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన కూడా ఇవేవీ చూడకుండా తన కూతురు ఎంచుకున్న వ్యక్తితో పెళ్లి జరిపించారు. తానే స్వయంగా తరలివచ్చి ఆ పెళ్లి పెద్దగా కూడా నిలిచారు. దీంతో ఎమ్మెల్యే రాచమల్లును అందరూ అభినందిస్తున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.. ఇవాళ తన మొదటి కుమార్తె రాచమల్లు పల్లవికి స్ధానిక సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అత్యంత సాదాసీదాగా పెళ్లి జరిపించారు. పల్లవి తన బాల్య స్నేహితుడైన పవన్ కుమార్ ను ప్రేమించింది. ఆస్ట్రేలియాలో మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసిన పల్లవి.. తన బాల్యమిత్రుని పెళ్లి చేసుకుంటానని తండ్రికి చెప్పడంతో వారి సంతోషం కోసం కులం, హోదా , డబ్బు అన్ని వదిలి వివాహం జరిపించాలని నిర్ణయించారు.

కులమతాలు, హోదాల కంటే తన కూతురు ప్రేమించిన వ్యక్తిని ఆమెకు ఇచ్చి పెళ్లి జరిపించాలని భావించినట్లు ఎమ్మెల్యే రాచమల్లు తెలిపారు. మొదట ప్రొద్దుటూరు పట్టణంలోని బొల్లవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో శాస్త్ర యుక్తంగా వివాహం జరిపించిన రాచమల్లు.. తర్వాత సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తన అనుచరులతో కలిసి వెళ్లి వివాహం రిజిస్టర్ చేయించారు. దీంతో అధికారికంగా వివాహం పూర్తయినట్లయింది.
కూతురికి ఆదర్శ వివాహం చేయించిన వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి #YSRCPMLA #RachamalluSivaPrasadReddy #ProdduturMLA #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/oqrV31td2y
— oneindiatelugu (@oneindiatelugu) September 7, 2023
ఈ సందర్భంగా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తనకు తన బిడ్డ సంతోషమే ముఖ్యమన్నారు. తాను కూడా కులాలు, మతాలకు అతీతంగా ఉండే వ్యక్తిని అని వివరించారు. సమాజంలో అందరూ సమానమని భావించే వ్యక్తిని కాబట్టే సంతోషంగా ఈ వివాహాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ పెళ్లితో రాచమల్లు కుటుంబంలోనూ సంతోషం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications