రప్పా, రప్పా ప్లకార్డు పట్టుకున్న వ్యక్తి టీడీపీ కార్యకర్తా..?- ఆధారాలు బయటపెట్టిన ఎమ్మెల్యే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన పల్నాడు జిల్లా పర్యటనలో కనిపించిన ఓ ప్లకార్డు ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది. జగన్ పర్యటనలో ఆ ప్లకార్డును పట్టుకుని కనిపించిన వ్యక్తి ఏ పార్టీకి చెందినవాడనే అంశం చర్చనీయాంశమౌతోంది.
ఈ ప్లకార్డు వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై.. వైఎస్ఆర్సీపీకి చెందిన యర్రగొండపాలెం శాసన సభ్యుడు తాటిపర్తి చంద్రశేఖర్.. ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వివాదానికి కేంద్ర బిందువు అయిన రప్పా రప్పా ఫ్లెక్స్ పెట్టి, దాన్ని పట్టుకుని కనిపించిన రవితేజ.. అన వ్యక్తి ఏ పార్టీకి చెందిన వాడని తాటిపర్తి చంద్రశేఖర్ ప్రశ్నించారు. అతనికి ఏ పార్టీ సభ్యత్వం ఉందని నిలదీశారు. అతని కుటుంబం ఏ పార్టీలో ఉందని సూటిగా ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉన్న రవితేజకు రప్పా, రప్పా ప్లకార్డును పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని అన్నారు. దాన్ని పట్టుకొని వైఎస్ జగన్ వద్దకు వెళ్లమని అతనికి చెప్పింది ఎవరు? అని తాటిపర్తి చంద్రశేఖర్ ప్రశ్నించారు. ఆ వ్యక్తికి తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉందని వెల్లడించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.
అంతకుముందు- వైఎస్ జగన్ నిర్వహించిన పల్నాడు జిల్లా పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించడం పట్ల మాజీ మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రిగా పని చేసిన నాయకుడిని జిల్లా పర్యటనకు వెళ్లనివ్వకుండా అడ్డుకోవడం ఏ మాత్రం సహేతుకం కాదని రోజా అన్నారు.
రప్పా... రప్పా... ఫ్లెక్స్ పెట్టి, పట్టుకున్న రవితేజ ఏ పార్టీకి చెందిన వ్యక్తి?
— T Chandra Sekhar MLA (@TatiparthiOnX) June 19, 2025
అతనికి ఏ పార్టీ సభ్యత్వం ఉంది?
వారి కుటుంబం ఏ పార్టీలో ఉంది?
తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వం రవితేజకు ఎందుకు ఉంది?
ఆ ఫ్లెక్స్ పట్టుకొని జగన్ గారి దగ్గరకు వెళ్ళమని తనకి చెప్పింది ఎవరు? pic.twitter.com/0es7hPLIOq
పోలీసులు, ప్రభుత్వం, అధికార యంత్రాంగం.. ఆంక్షలు పెట్టి అత్యంత ప్రజాదరణ కలిగిన ఓ నాయకుడిని అడ్డుకోవడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. దీనిపై తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వ వేధింపులు భరించలేక వైఎస్ఆర్సీపీకి చెందిన కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు.












Click it and Unblock the Notifications