చంద్రబాబును తిట్టను-దేవినేని ఉమనే తిడతా- లాజిక్ ఇదేనన్న ఎమ్మెల్యే వసంత..
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వైసీపీ నేత వసంత కృష్ణప్రసాద్ తరచుగా ఆయన రాజకీయ ప్రత్యర్ధి, మాజీ మంత్రి దేవినేని ఉమను టార్గెట్ చేస్తుంటారు. అయితే ఆయన పార్టీ అధినేత చంద్రబాబును మాత్రం విమర్శించేందుకు ఇష్టపడరు. దీని వెనుక ఏముందనే దానిపై నియోజకవర్గంలో సైతం చర్చలు జరుగుతుంటాయి. దీనిపై ఇవాళ వసంత క్లారిటీ ఇచ్చారు.
తాను దేవినేని ఉమను మాత్రమే తిడతానని, చంద్రబాబును తిట్టబోనని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. చంద్రబాబును తిట్టాల్సిన అవసరం తనకు లేదన్నారు. కేవలం ఉమను మాత్రమే తిడతానన్నారు. దీని వెనుక ఉన్న లాజిక్, కారణాల్ని కూడా ఆయన బయటపెట్టారు. తనను టార్గెట్ చేసి విమర్శలు చేసే ఉమను మాత్రమే తాను తిడతానని, చంద్రబాబును విమర్శించాల్సిన అవసరం తనకు లేదనట్టుగా ఆయన మాట్లాడారు. అలాగే తాను చంద్రబాబును తిట్టకపోతే ఏం జరుగుతుందో కూడా వసంత చెప్పారు.

చంద్రబాబును తిట్టకపోతే తాను టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు దేవినేని ఉమ చెప్పుకుంటున్నట్లు వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. కానీ తనకు టీడీపీలో చేరాల్సిన అవసరం లేదన్నారు. తనతో ఏదో విధంగా చంద్రబాబును తిట్టించేందుకు దేవినేని ఉమ ప్రయత్నిస్తున్నాడని, కానీ తనకు మాత్రం అలాంటి అవసరం లేదన్నారు. ఉమ మాత్రమే ఇలాంటి పనులు చేస్తాడన్నారు. ఆయనతో పాటు కుటుంబంలో వాళ్లందరూ ఆడవాళ్ల పేర్లే పెట్టుకున్నారని వసంత గుర్తుచేశారు. ఏదేమైనా వసంత బయటపెట్టిన లాజిక్ ఇప్పుడు మైలవరంలో కొత్త చర్చకు దారి తీస్తోంది.












Click it and Unblock the Notifications