ఇరుగ్గా అసెంబ్లీ: జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, రెడీ: యనమల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభపై జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం శానససభా సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వారు బుధవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభను పరిశీలించారు. శాసనసభ చాలా ఇరుగ్గా ఉందని వారన్నారు. శాసనసభను పరిశీలించినవారిలో శ్రీకాంత్ రెడ్డితో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇతర శానససభ్యులు ఉన్నారు.
కాగా, పాత అసెంబ్లీని ఆంధ్ర ప్రధేశ్‌కు కేటాయిండంతో అందులో 175 మంది ఎమ్మెల్యేలు కూర్చోనేందుకు సర్వం సిద్దం చేశామని ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఒక్క మీడియా పాంయింట్ ను మాత్రం వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి సిద్దం చేస్తామని, ప్రస్తుతం మీడియా పాంయింట్ జరిగే ప్రదేశంలోనే మీడియా పాంయిట్‌ను ఏర్పాటు చేసినట్లు యనమనల తెలిపారు.

అసెంబ్లీలోకి గేట్ నెంబర్ 2ను ఆంధ్రప్రధేశ్ రాష్ట్రానికి కేటాయించడంతో అందులోనుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలను లోనికి అనుమతిస్తారన్నారు. సమావేశాలు మొదటి రోజున ప్రొటెం స్పీకర్ 9.52 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేసి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని చెప్పారు. శుక్రవారం స్పీకర్ ఎన్నిక అనంతరం బీఏసీ సమావేశం ఉంటుందని యనమల అన్నారు.
ఐదురోజుల పాటు జరగబోయే తొలి సమావేశాలకు రాజకీయ పార్టీలు కూడాా సిద్దమవుతున్నాయి. తొలి మూడు రోజులు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలు, స్పీకర్ ఎన్నిక గవర్నర్ ప్రసంగం ఉండగా మిగిలిన రెండు రోజులు అసెంబ్లీలో వాడి వేడి చర్చజరగనుంది. అయితే అధికార పక్షంగా టిడిపి, బీజేపి కూటమి ఉండగా ప్రతిపక్షంగా కేవలం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రమే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉండడంతో సమావేశాలపై ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications