Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం జగన్ తో ఒక్క సారి - వైసీపీ ఎమ్మెల్యేల మనసులో మాట..!?

వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తికి కారణం ఏంటి. సీఎం జగన్ - ఎమ్మెల్యేల మధ్య అప్పాయింట్ మెంట్ గ్యాప్ వచ్చిందా. దీనికి ఎవరు కారణం. మెజార్టీ ఎమ్మెల్యేలు ఏం కోరుకుంటున్నారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత అధికార పార్టీలో నేతల మధ్య ఈ చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి జగన్ - ఎమ్మెల్యేల మధ్య పార్టీలో పెద్ద వ్యవస్థే ఉంది. కానీ, మెజార్టీ ఎమ్మెల్యేల్లో ఒక రకమైన అభిప్రాయం కనిపిస్తోంది. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..ఎమ్మెల్యేలు వెల్లడిస్తున్న అభిప్రాయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. మరి..సీఎం జగన్ ఏం చేయబోతున్నారు.

సీఎం జగన్ అన్నీ తానై..
2019 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఏరి కోరి మరీ ఎమ్మెల్యే అభ్యర్ధులను ఎంపిక చేసారు. ప్రాంతీయ - సామాజిక సమీకరణాలతో పక్కా లెక్క అమలు చేసారు. 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించు కున్నారు. ముఖ్యమంత్రి అయ్యారు. తాను ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రయత్నించారు. 95 శాతం వరకు అమలు చేస్తున్నామని ప్రభుత్వంలోని ముఖ్యులు చెబుతున్నారు. కేబినెట్ రెండు సార్లు విస్తరించారు. 40 మంది వరకు అవకాశం దక్కింది. సీనియర్లు కొందరికి దక్కాల్సి ఉన్నా..జగన్ అమలు చేస్తున్న సామాజిక సమీకరణాలతో వారికి దక్కలేదు. కానీ, వారెవరూ పార్టీని వీడలేదు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించ లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఓట్ల వేళ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందంటూ చర్చ మొదలైంది.

YSRCP MLAs wanted to speak out their heart to CM Jagan, but what is stopping them-Here is all

ప్రాధాన్యత - గుర్తింపు
ముఖ్యమంత్రి నవరత్నాలను పక్కాగా అమలు చేస్తున్నారు. సంక్షేమ పధకాలు కొనసాగిస్తున్నారు. సీఎం జగన్ తాను నేరుగా బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లోని నిధులు విడుదల చేస్తున్నారు., దీని ద్వారా స్థానికంగా ఎమ్మెల్యేల ప్రమేయం ప్రత్యక్షంగా ఉండటం లేదు. కొన్ని పథకాల్లో మాత్రం వారం - పది రోజుల కార్యక్రమాల నిర్వహణ సమయంలో ఎమ్మెల్సీకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ అందు బాటులోకి వచ్చింది. పథకాలు అందించటంలో వారి పాత్ర పెరిగింది. గతంలో లాగా లబ్ది దారులు పథకాల కోసం..పనుల కోసం ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చే పరిస్థితి తగ్గిపోయింది. ఇదే సమయంలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు..పార్టీ వ్యవహారాలపై నేరుగా సీఎంతో చర్చించాలని కోరుకుంటున్నారు. కానీ, మధ్యలో పార్టీ ముఖ్య నేతల ప్రమేయం పెరిగింది.

ఆ గ్యాప్ తగ్గించండి..
సీఎం - ఎమ్మెల్యేల మధ్య చిన్న గ్యాప్ కనిపిస్తోంది. నేరుగా సీఎంను కలిసి తమ సమస్యలు చెప్పుకొనే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఎమ్మెల్యేల అంర్గత చర్చల్లోనూ ఇదే అంశం ప్రధాన చర్చగా మారుతోంది. కొంత మంది అధికారుల తీరు పైనా ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ గతంలో నియోజకవర్గాల వారీగా కొన్ని సమీక్షలు నిర్వహించారు. వీటిని కొనసాగించాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. టికెట్ల కేటాయింపు అధికారం పూర్తిగా సీఎందేనని స్పష్టం చేస్తున్నారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..పార్టీలో ప్రతీ స్థాయిలో ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఇక, ఇప్పుడు ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వటం పైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+