జగన్ 'క్లాస్' ఎఫెక్ట్: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను చిక్కుల్లోకి నెడుతారా?
రామ్‌నాథ్ కోవింద్ పరిచయ కార్యక్రమంలో జగన్ దళిత, గిరిజన ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారని, వారితో కాళ్లు మొక్కించుకున్నట్లుగా తెలుస్తోందన్న ఆంధ్రజ్యోతి కథనంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.
అమరావతి: ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ పరిచయ కార్యక్రమంలో వైసిపి అధినేత జగన్ దళిత, గిరిజన ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారని, వారితో కాళ్లు మొక్కించుకున్నట్లుగా తెలుస్తోందన్న ఆంధ్రజ్యోతి కథనంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.
ఇప్పటికే ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నిప్పులు చెరిగారు. ఆమెతో పటు ఎమ్మెల్యేలు కళావతి, పుష్పశ్రీవాణిలు మరోసారి నిప్పులు చెరిగారు. గిరిజన, దళిత ఎమ్మెల్యేలను అవమానించిన ఆంధ్రజ్యోతిపై కేసు వేస్తామని హెచ్చరించారు.
చదవండి: జగన్ కాళ్లు మొక్కించుకున్నారంటూ..: ఆంధ్రజ్యోతిపై ఆగ్రహం వెనుక
ఇంత అన్యాయంగా, దారుణంగా అబద్దాలు ఎలా రాస్తారని వారు ప్రశ్నించారు. రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్‌కు తమను పేరుపేరునా జగన్ పరిచయం చేశారన్నారు.

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో తాము ఫోటో దిగితే జగన్ క్లాస్ తీసుకున్నారన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. తాము ఫోటోలు దిగితే జగన్ జీర్ణించుకోలేదని చెప్పడం దుర్మార్గమన్నారు.
గిరిజన టీచర్లకూ ఏకీకృత సర్వీస్ రూల్స్ వర్తింపు కోరుతూ వెంకయ్యకు వినతిపత్రం ఇవ్వాలా వద్దా అని తాము సంశయించామని, ఇదే విషయాన్ని జగన్‌ను అడిగితే.. వెంకయ్యకు ఇవ్వండని తమకు చెప్పారని తెలిపారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications