దువ్వాడ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్! భార్యా, కూతురుపై హత్యాయత్నం ఫిర్యాదు..!
నిన్న అర్ధరాత్రి అక్రమ సంబంధంపై తనను ప్రశ్నించేందుకు వచ్చిన భార్య, కుమార్తెలపై దాడికి పాల్పడిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇవాళ వారిపై హత్యాయత్నం ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి తన ఇంటికి వచ్చిన భార్య, కుమార్తెపై బూతులతో విరుచుకుపడిన ఆయన.. కర్రతో దాడికి కూడా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన్ను అడ్డుకుని వారికి అక్కడి నుంచే పంపేశారు. దువ్వాడ శ్రీనివాస్ వైఖరిపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం స్వయంగా టెక్కలి పీఎస్ కు వెళ్లిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అక్కడ సీఐకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. భార్య వాణి, ఆమె కుమార్తె హైందవి అర్ధరాత్రి తన ఇంటికి అనుచరులతో వచ్చి దాడికి పాల్పడ్డారని, హత్యాయత్నం చేశారని ఆయన ఆరోపించారు. వీరిని వెంటనే అరెస్టు చేసి తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు చేసిన ఫిర్యాదులో కోరారు. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగినట్లయింది.

ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ అక్రమ సంబంధం విషయంలో ఇంత రచ్చ జరుగుతున్నా స్పందించని పోలీసులు.. ఇప్పుడు ఆయన ఫిర్యాదుపై ఏం చేస్తారో చూడాలి. మరోవైపు అర్ధరాత్రి దువ్వాడ వ్యవహారశైలిపై భార్య, కుమార్తె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ తో ఉంటున్న మాధురి తనకు పెళ్లయిందని, విడాకులు కాలేదని చెప్తోందని కుమార్తె హైందవి తెలిపారు.
అలాగే తన తల్లి వాణితో కూడా విడాకులు కాలేదని చెప్తోందన్నారు. దీన్నిబట్టి తన తండ్రి దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిత్వం అర్ధమవుతోందన్నారు. మాధురి, శ్రీనివాస్ మధ్య సాగిన పలు వాట్సాప్ చాటింగ్స్ లను కూడా బయటపెట్టారు.
Download











Click it and Unblock the Notifications