నారీసంకల్పదీక్ష చేసే అర్హత టీడీపీకి లేదు; చంద్రబాబు, లోకేష్ లపైనా పోతుల సునీత ఆగ్రహం
టిడిపి కేంద్ర కార్యాలయంలో మహిళలపై అఘాయిత్యాలు, మద్యపాన నిషేధం, నిత్యావసర వస్తువుల ధరల పెంపు, డ్వాక్రా సంఘాల నిర్వీర్యం తదితర అంశాలపై వైసిపి ప్రభుత్వ వైఖరికి నిరసనగా నారీ సంకల్ప దీక్ష చేపట్టారు తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన టిడిపి మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై దాడులు సర్వసాధారణమయ్యాయి అని తీవ్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ చేపట్టిన దీక్షపై వైసీపీ మహిళా నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.

నారీ సంకల్ప దీక్ష చేసే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదు
నారీ సంకల్ప దీక్ష చేసే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదని టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత పేర్కొన్నారు. వినోద్ జైన్ లాంటి వాళ్లను పెంచి పోషిస్తున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా దీక్షలు చేస్తారంటూ ఎమ్మెల్సీ పోతుల సునీత ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పోతుల సునీత చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో చంద్రబాబు.. ప్రజలంతా చూస్తున్నారు అంటూ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నది నారీ సంకల్ప దీక్ష కాదు దుస్సంకల్ప దీక్ష అంటూ ఎద్దేవా చేశారు.

లోకేష్ స్విమ్మింగ్ పూల్ ఫోటోలు చూస్తే మహిళల పట్ల వారి దృష్టి అర్ధమవుతుంది
లోకేష్ పిఏ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, ఈ విషయాన్ని చంద్రబాబు పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. లోకేష్ స్విమ్మింగ్ పూల్ ఫోటోలు చూస్తే తెలుగుదేశం పార్టీ నేతలకు మహిళల పట్ల ఏమాత్రం గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చని పోతుల సునీత పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో చాలామంది నాయకులు దుశ్శాసనుల్లా మారారని ఆమె విరుచుకుపడ్డారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ లాంటి సంఘటనలు టీడీపీ చరిత్రలో ఎన్నో ఉన్నాయని పోతుల సునీత ఆరోపణలు గుప్పించారు.

మహిళల పట్ల ఇలా వ్యవహరిస్తే టిడిపి నేతలకు పతనం తప్పదు
చంద్రబాబు మహిళల కోసం ఏం చేశాడో ధైర్యంగా చెప్పమనండి అంటూ ప్రశ్నించారు. ఎల్లో మీడియాలో గొప్పలు తప్ప చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఏమీ లేదు అంటూ ఎద్దేవా చేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, పసుపుకుంకుమ అంటూ చంద్రబాబు మహిళలను మోసం చేశారని పోతుల సునీత మండిపడ్డారు. రిషితేశ్వరికి చంద్రబాబు న్యాయం చేయలేక పోయారని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల ఇలా వ్యవహరిస్తే టిడిపి నేతలకు పతనం తప్పదని హెచ్చరించారు.

ఆ టిడిపి నాయకుడికి ఉరిశిక్ష వేయాలని సీఎంని కోరుతున్నా
దిశ చట్టాన్ని తీసుకువచ్చి మహిళలకు అండగా నిలిచిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని పోతుల సునీత పేర్కొన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ రక్షణ కోసం పాటు పడుతున్నారని పోతుల సునీత చెప్పుకొచ్చారు. బాలికను లైంగిక వేధింపులకు గురి చేసి ఆమె ఆత్మహత్యకు కారణమైన టిడిపి నాయకుడికి ఉరిశిక్ష వేయాలని సీఎంని కోరుతున్నాను అంటూ పేర్కొన్నారు. వినోద్ జైన్ లాంటి వాళ్లను పెంచి పోషిస్తున్న చంద్రబాబు ఏ విధంగా దీక్షలు చేయిస్తున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పోతుల సునీత డిమాండ్ చేశారు.
Recommended Video

వైసీపీ పనితీరు ఓర్చుకోలేక చంద్రబాబు గోబెల్స్ ప్రచారం
వినోద్ జైన్ లాంటి వాళ్లకు ఈ సంఘంలో బ్రతికే అర్హత లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుండి 2019 సంవత్సరాలలో రేప్ కేసులు, మర్డర్ కేసులు విచారణకు మూడు వందల నలభై రోజుల సమయం పట్టిందని, ఇప్పుడు వారం రోజుల్లోనే కేసులు విచారణ చేస్తున్నారని పోతుల సునీత పేర్కొన్నారు. ఇవన్నీ చూసి ఓర్చుకోలేక చంద్ర బాబు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారంటూ పోతుల సునీత మండిపడ్డారు. టిడిపి మహిళా నేతలు నారీ సంకల్ప దీక్ష చేసి ఉన్న పరువు పోగొట్టుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications