హీరో ప్రభాస్‌తో వైసీపీ కీలక నేత.. బీజేపీ నేతలతో కలిసి విందు.. ఫొటోలు వైరల్..
పుట్టింది పొలిటికల్ ఫ్యామిలీనే అయినా పాలిటిక్స్‌తో సంబంధం లేదని.. ఆ దిశగా ఏనాడూ ఆలోచించలేదని హీరో ప్రభాస్ ఇప్పటికి చాలా సార్లు చెప్పుంటారు. ఈ వార్త కూడా ఆయన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిందేమీ కాదు. రకరకాల రీజన్లతో వివిధ పార్టీలవాళ్లు ఆయన్ని ఇదివరకు కూడా కలిశారు. కానీ ఏపీలో బీజేపీ యాక్టివ్ అవుతున్న తరుణంలో ప్రస్తుత పరిణామం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ముఖ్యనేత, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇటీవలే ప్రభాస్ ను కలిసిన ఫొటోలు వైరలయ్యాయి.
అసలేం జరిగిందంటే..
రెబల్ స్టార్, బీజేపీ మాజీ ఎంపీ కృష్ణంరాజు జనవరి 20న బర్త్ డే జరుపుకున్నారు. ఆ వేకుకు రాలేని మిత్రుల కోసం మళ్లీ విడివిడిగా పార్టీ ఇచ్చారు. సినీ ప్రముఖులకు ఓసారి, పొలిటికల్ పర్సనాలిటీలకు మరోసారి విందు ఇచ్చారు. ఆలా బీజేపీ నేతలకు కృష్ణంరాజు ఇచ్చిన విందులో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పాల్గొనడం, రెబల్ స్టార్, యంగ్ రెబల్ స్టార్ లతో కలిసి దిగిన ఫొటోలు దిగడం చర్చనీయాంశమైంది.

ఆపరేషన్ కమల్?
ఒకవైపు టీడీపీని నిర్వీర్యం చేస్తూ మరోవైపు వైసీపీని బలంగా ఢీకొడుతూ ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకుంటోన్న బీజేపీ ఈ మధ్యే పవన్ కల్యాణ్ సారధ్యంలోని జనసేన పార్టీతోనూ పొత్తు కుదుర్చుకుని కలిసి పనిచేయాలని డిసైడైంది. ఆపరేషన్ కమల్ లో భాగంగా కొంత మంది వైసీపీ నేతలనూ ఆకర్షించేందుకు కాషాయదళం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు నేరుగా ప్రధాని మోదీతో సంప్రదింపులు జరుపుతుండటం, ఢిల్లీలో ఎంపీలకు భారీ స్థాయిలో విందు ఇవ్వడం తదితర పరిణామాలు వైసీపీ శ్రేణుల్లో ఆలోచన రేకెత్తించాయి. తాజాగా రెబల్ స్టార్ బర్త్ డేకి ఎంపీ రఘురామ రాజు.. బీజేపీ నేతలతో కలిసి వెళ్లడంతో గుసగుసల సౌండ్ ఇంకొచెం పెరిగింది.












Click it and Unblock the Notifications