సుప్రీంకు రఘురామ వినతి-టార్గెట్ జగన్ సర్కార్-ఏపీ సీఐడీ టార్చర్

ఏపీలో వైసీపీ సర్కార్ కూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకూ మధ్య సాగుతున్న పోరు ఇవాళ సుప్రీంకోర్టులో చర్చకు వచ్చింది. గతంలో ఏపీ సర్కార్ తనపై దాఖలు చేసిన రాజద్రోహం కేసులో సీఐడీ వేధింపుల్ని సుప్రీంకోర్టే నిర్ధారించిన నేపథ్యంలో దీనిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. దీని విచారణలో పురోగతి లేకపోవడంతో ఇవాళ రఘురామ మరోసారి సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఏపీ సర్కార్ పై తాను దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వేగవంతం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు త్వరలో ఈ వ్యవహారంపై విచారణ జరుపుతామని ప్రకటించింది.

 వైసీపీ వర్సెస్ రఘురామ పోరు

వైసీపీ వర్సెస్ రఘురామ పోరు

ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే యుద్ధం చేస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ఇప్పటికే వైసీపీ సర్కార్ ను, సీఎం జగన్ ను ప్రతీ విషయంలో టార్గెట్ చేస్తున్న రఘురామ.. ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే దిశగా పావులు కదుపుతున్నారు. గతంలో సీఐడీ తనపై దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందిన రఘురామ ఇప్పుడు మరోసారి అదే కోర్టును ఆశ్రయించి న్యాయం కోరుతున్నారు. గతంలో రాజద్రోహం కేసులో తనను అరెస్టు చేసిన తర్వాత సీఐడీ వ్యవహరించిన తీరుపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనను టార్గెట్ చేసిన సీఐడీని ఎలాగైనా ఇరుకునపెట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.
దీంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

 రఘురామపై దేశద్రోహం కేసు

రఘురామపై దేశద్రోహం కేసు

వైసీపీపై అసమ్మతి స్వరం వినిపించే క్రమంలో రఘురామరాజు క్రిస్టియన్లు, రెడ్లను టార్గెట్ చేస్తూ పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల వీడియో రికార్డులను సేకరించిన సీఐడీ ఆయనపై రాజద్రోహం కేసులు మోపింది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు రెండు టీవీ ఛానళ్లతో కలిసి ఆయన కుట్ర చేశారని ఆరోపించింది. ఈ వ్యవహారంలో రఘురామ చేసిన వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకున్న వైసీపీ సర్కార్.. సీఐడీ సాయంతో రాజద్రోహం కేసులు పెట్టించింది. హైదరాబాద్ లో రఘురామరాజును అరెస్టు చేసి గుంటుూరు సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చిన అధికారులు.. ఆయన్న కస్టడీలో వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన రఘురామరాజు తనపై సీఐడీ అధికారులు కస్టడీలో దాడి చేసినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ ఆరోపణలు నిర్ధారించింది.

రఘురామకు బెయిలిచ్చినా

రఘురామకు బెయిలిచ్చినా

రఘురామరాజుపై సీఐడీ దాఖలు చేసిన రాజద్రోహం కేసులో బెయిల్ ఇచ్చినా కేసు విచారణ మాత్రం కొనసాగుతూనే ఉంది. బెయిల్ షరతుల్లో భాగంగా సుప్రీంకోర్టు విచారణ కొనసాగుతుందని, దానికి సహకరించాల్సిందేనని ఆదే్శించింది. మరోవైపు ఏపీ సీఐడీ కూడా ఈ కేసు విచారణను ఆ తర్వాత అంత సీరియస్ గా పట్టించుకోలేదు. కానీ రఘురామ మాత్రం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని సీఐడీని ఇరుకునపెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా గతంలో తనపై సీఐడీ కస్టడీలో జరిగిన దాడిని తెరపైకి తెచ్చారు. దీనిపై ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిన రఘురామ దీన్ని మరోసారి కెలుకుతున్నారు.

సుప్రీంలో రఘురామ పిటిషన్

సుప్రీంలో రఘురామ పిటిషన్

తనపై ఏపీ సీఐడీ అధికారులు కస్టడీలో విచారణలో భాగంగా దాడి చేసినట్లు, గాయపరిచినట్లు సుప్రీంకోర్టు నిర్ధారించడంతో అదే ఆరోపణల్ని పట్టుకుని రఘురామరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇప్పటివరకూ విచారణ నిర్వహించలేదు. దీంతో సుప్రీంకోర్టులో విచారణ ఆలస్యం అవుతుండటంపై మళ్లీ రఘురామరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై కస్టోడియల్ దాడి కేసులో సుప్రీంకోర్టు త్వరిత గతిన విచారణ నిర్వహించాలని కోరారు. పలుమార్లు పిటిషన్ లిస్టింగ్ అయినా విచారణ జరగకపోవడాన్ని రఘురామ ఆక్షేపించారు. ఈ విచారణ ఆలస్యం కావడం వల్ల తలెత్తే పరిణామాల్ని కూడా ఆయన సుప్రీంకోర్టుకు వివరించినట్లు తెలుస్తోంది.

రఘురామ వినతిపై స్పందించిన సుప్రీంకోర్టు

రఘురామ వినతిపై స్పందించిన సుప్రీంకోర్టు


రాజద్రోహం కేసులో అరెస్టు చేసి తనను గుంటూరు సీఐడీ కార్యాలయానికి తెచ్చిన తర్వాత తనపై ఏపీ సీఐడీ అధికారులు కస్టడీలో దాడి చేశారంటూ రఘురామ వేసిన పిటిషన్ ఆలస్యం కావడాన్ని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. రఘురామ ఈ వ్యవహారాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకుకరావడంతో స్పందించిన సుప్రీంకోర్టు త్వరలో దీనిపై విచారణ చేపడతామని వెల్లడించింది. రఘురామపై సీఐడీ కస్టడీలో దాడిపై దాఖలు చేసిన పిటిషన్ త్వరలో విచారణకు వచ్చేలా సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి తగు ఆదేశాలు ఇస్తామని న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరత్ ప్రకటించారు. దీంతో ఈ కేసు విచారణ త్వరలో ప్రారంభమయ్యే అవకాశముంది. అదే జరిగితే ఏపీ ప్రభుత్వం ఇరుకునపడటం ఖాయంగా కనిపిస్తోంది.

సీఐడీని వదలబోనంటున్న రఘురామ

సీఐడీని వదలబోనంటున్న రఘురామ

ఏపీ ప్రభుత్వం మోపిన రాజద్రోహం కేసు విచారణ సందర్భంగా కస్టడీలో తనపై దాడి చేసిన సీఐడీ అధికారుల్ని వదిలిపెట్టేది లేదని గతంలో పలుమార్లు రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ ఆలస్యం కావడంపై నేరుగా ధర్మాసనాన్ని ఆశ్రయించి త్వరలో విచారణ జరిగేలా ఆదేశాలు తెచ్చుకున్నారు. మరోవైపు ఏపీ సీఐడీ ఛీఫ్ పీవీ సునీల్ కుమార్ ను వరకట్నం కేసులో చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖను ఆశ్రయించి అక్కడి నుంచి ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు వచ్చేలా చేశారు. దీంతో గతంలో తనను వేధించిన సీఐడీ అధికారుల్ని ఎట్టి పరిస్ధితుల్లో వదిలిపెట్టకూడదన్న పంతం రఘురామరాజులో కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+