Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

bigg boss గుట్టు రట్టు దిశగా సీబీఐ -సీఎం జగన్ పై వైసీపీలో ఆందోళన -సాయిరెడ్డికి దిమ్మతిరిగేలా RRR కౌంటర్

ఆర్థిక నేరాలకు సంబంధించి పరస్పర ఫిర్యాదులు, మీడియా, సోషల్ మీడియా వేదికగా మాటల దాడులతో వైసీపీ హైకమాండ్‌కు, ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు మధ్య యుద్ధం ఇంకాస్త పెద్దదయింది. ఏపీ ఆర్థిక పరిస్థితి సాకుతో జగన్ సర్కారును కూలదోయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, అందుకు రఘురామను పావుగా వాడుకుంటోదని వైసీపీ పెద్దలు ఆరోపిస్తుండగా, వైఎస్ మరణిస్తే జగన్ కు తలపోటైనా రాలేదని, జడ్జిలపై దూషణల వెనుక బిగ్ బాస్ ఎవరో, వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో కీల సూత్రధారులెవరో గుట్టు రట్టు చేసే దిశగా సీబీఐ వెళుతోందని, చేసిన తప్పులకు జగన్, సాయిరెడ్డి మళ్లీ జైలుకు పోబోతున్నారని రఘురామ ఎదురుదాడికి దిగారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రఘురామ పలు కీలక అంశాలను చెప్పారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

జడ్జిలపై దూషణల కేసు..

జడ్జిలపై దూషణల కేసు..

''ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు కనీసం బతకగలుగుతున్నారంటే అది కేవలం కోర్టులు ఉండటం వల్లే అన్నది సుస్పష్టం. సాక్ష్యాత్తూ జడ్జిల మీదే జగన్ ప్రభుత్వం పిచ్చి పనులకు పాల్పడింది. రాజ్యాంగానికి తూట్లు పొడుతూ పిచ్చి పిచ్చి జీవోలు ఇస్తే కోర్టులు చూస్తూ ఊరుకుంటాయా? ఇప్పటికే 150కిపైగా జీవోలను కోర్టులు కొట్టేసినా పద్ధతి మార్చుకోకపోగా, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఏర్పాటైన డిజిటల్ మీడియా కార్పొరేషన్ ద్వారా జడ్జిలపై, ప్రశ్నించే నాలాంటి వాళ్లపై తిట్లు, దూషణలకు పాల్పడుతున్నారు. ప్రజాధనాన్ని దారి మళ్లించి జీతాలిస్తూ మరీ జడ్జిలను తిట్టిస్తున్నారు. దీనికి సంబంధించి సీబీఐ ఇటీవల అరెస్టులు కూడా చేసింది. అయితే వాళ్ల వెనకున్న బిగ్ బాస్..

బిగ్‌బాస్‌ ఎవరు? సీబీఐ పట్టాలి..

బిగ్‌బాస్‌ ఎవరు? సీబీఐ పట్టాలి..


ఏ2గా ప్రసిద్ధిగాంచిన ఎంపీ విజయసాయిరెడ్డి గతంలో ఓసారి విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ, జడ్జిలను తిట్టే వైసీపీ సోషల్ సైన్యాలకు అభయం ఇచ్చారు. మన వెనుక బిగ్ బాస్ ఉన్నారు, బిగ్ బాస్ అండాదండా మనకుంటాయని సాయిరెడ్డి స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, కొందరు విదేశీయుల ద్వారానూ జడ్జిలను తిట్టించారు. పంచ్ ప్రభాకర్ అనే పశువుల డాక్టర్ తాను మనిషన్న సంగతి మర్చిపోయి, భారత రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నత స్థానంలో ఉన్నవాళ్లను, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలను తీవ్రంగా దూషించాడు. అసలు దేశ ద్రోహం కేసులు పెట్టాల్సింది ఈ దరిద్రుల మీద. ప్రశ్నించే నాలాంటివాళ్లపై కాదు. జడ్జిలపై దూషణలకు అండగా ఉన్న ఆ బిగ్ బాస్ ఎవరో కనిపెట్టే దిశగా సీబీఐ దర్యాప్తు చేయాలి. ఇదే సీబీఐకి సంబంధించి..

వివేకా హత్యలో సాయిరెడ్డి పాత్ర..

వివేకా హత్యలో సాయిరెడ్డి పాత్ర..


ఆగస్టు 8 వైఎస్ వివేకానంద రెడ్డి జయంతి. ఆయన హత్య కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ ఇటీవల కీకంగా వ్యవహరిస్తోంది. అదే క్రమంలో వివేకా హత్య కేసులో విజయసాయిరెడ్డి పాత్రపైనా దర్యాప్తు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే, వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు సాయిరెడ్డి మీడియా సాక్షిగా చెప్పిన మాటలు అనుమానాలకు తావిస్తున్నది. తెల్లవారుజామున వివేకా హత్యకు గురైతే, ఉదయం 8 గంటలకు సాయిరెడ్డి హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. వివేకా గుండెపోటుతో మరణించారని వెల్లడించారు. గొడ్డలి వేటును గుండెపోటుగా చెప్పాల్సిన అవసరం సాయిరెడ్డికి ఏమొచ్చింది? అలా చెప్పమని తన సహచరులు చెప్పారా? లేక పులివెందుల ఇంట్లో నుంచి ఎవరైనా గుండెపోటే అని కబురు చేశారా? సాయిరెడ్డి మాటలను సీబీఐ వారు తీవ్రంగా పరిగణించి, అవసరమైతే ఆయనను కస్టడీలోకి తీసుకొనైనా ప్రశ్నించారు. జడ్జిలను దూషించిన కేసుల్లోనూ సాయిరెడ్డిని అదుపులోకి తీసుకుంటే మంచిది. ఇక..

సాయిరెడ్డిని అలాగే పిలుస్తాం.. వివక్ష కాదా

సాయిరెడ్డిని అలాగే పిలుస్తాం.. వివక్ష కాదా

వైసీపీ ప్రధాన కార్యదర్శి అయిన విజయసాయిరెడ్డి అంటే నాకెంతో గౌరవం, ఆయన్ను విజ్జి అని పిలుకుంటానేను. నాకు సంబంధించిన పవర్ కంపెనీలో రూ.800కోట్లు అక్రమాలు జరిగాయని ఆయన కేంద్రానికి చేసిన ఫిర్యాదుపై ముందుకెళతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతామన్ చెప్పినట్లు ఆయనొక ట్వీట్ చేశారు. అందులో మిగతా ఫొటోలు కలర్ లో, నాది మాత్ర బ్లాక్ అండ్ వైట్ లో చూపించి వివక్షకు గురిచేశారు. నా కంపెనీ వ్యవహారంపై అన్ని విషయాలు స్పష్టంగా ఉన్నాయి. ఎటొచ్చీ నా పిటిషన్ల కారణంగా జగన్, సాయిరెడ్డిల బెయిల్ రద్దు కాబోతోందన్నదే వారి ఆందోళనకు కారణం. సాయిరెడ్డికి కౌంటర్ గా నేను కూడా ఇవాళ ఓ పోస్టు పెట్టి అందులో జగన్, సాయిరెడ్డిలను బ్లాక్ అండ్ వైట్ లో చూపించా. వాళ్లపై కేసుల వ్యవహారాన్ని కేంద్రం పరిశీలించాలని రాష్ట్రపతి ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఏ1, ఏ2ల బెయిల్ రద్దయి, వారి ఆగడాలు అన్నీ బయటికి వస్తాయి. చివరిగా,

జగన్‌పై వైసీపీ ఎమ్మెల్యేల ఆందోళన

జగన్‌పై వైసీపీ ఎమ్మెల్యేల ఆందోళన

నర్సాపురం ఎంపీ రఘురామ కనబడటంలేదు అని స్థానిక వైసీపీ నేతలు కొందరు కరపత్రాలు ముద్రించి పంపిణీ చేశారు. నేను నేరుగా నియోజకవర్గంలో లేకపోయినా, ప్రతిరోజూ వార్తల్లో ఉంటున్నాను. టీవీల్లోగానీ, పేపర్లలోగానీ ఏనాడూ నన్ను చూడని చూడనివాళ్లు ఏపీలో ఉండరు. చివరిసారిగా కోడి పందేల సమయంలో కనిపించానని కరపత్రంలో రాశారు. అవునుమరి, నాకు ఖరీదైన వీడియో గేమ్స ఆడటం రాదు. నేను కనపడటం లేదని పక్కన పెడితే, రాష్ట్రంలో ఉన్న వైసీపీ మంత్రులకుగానీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలకుగానీ అక్కడే ఉంటోన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కనబడుతున్నారా? మా ముఖ్యమంత్రి అసలే కనిపించట్లేదని వైసీపీ ఎమ్మెల్యేలే ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాదు,

వైఎస్ చనిపోతే జగన్‌కు తలపోటైనా రాలే

వైఎస్ చనిపోతే జగన్‌కు తలపోటైనా రాలే

వైసీపీ ఎమ్మెల్యేలకే కనిపించకుండా ఉంటోన్న సీఎం జగన్ కు.. తాను ఉంటోన్న ప్రాంతానికి కొద్ది దూరంలో అమరావతి రైతులు 600 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా కనిపించడంలేదు. గతంలో 3900కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఆయన ఇప్పుడు ఎందరికి కనిపిస్తున్నారు? జగన్ నిర్ణయాల వల్ల అమరావతిలో చోటుచేసుకున్న మరణాలకు ఆయన బాధ్యుడు కాడా? తన తండ్రి కోసం చనిపోయినవాళ్లను కలవడానికి ఓదార్పు యాత్రలు చేశారే, వైఎస్ పేరు కూడా తెలియనివాళ్ల మరణాలను కూడా తమ ఖాతాలో వేసుకున్నారు. అసలు, వైఎస్ చనిపోతే వందల మందికి గుండె ఆగిపోయింది కదా.. మరి కొన్న కొడుకైన జగన్ కు కనీసం తలపోటైనా వచ్చిందా? జనం తరఫున మాట్లాడుతున్నది ఎవరు? కనబడకుండా ఉన్నది ఎవరు? నేను ప్రతి విషయాన్ని లైవ్ లోనే, ధైర్యంగా మాట్లాడుతున్నా. అదీ నా ట్రాక్ రికార్డు..'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+