వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్.. ఒళ్లు జాగ్రత్త, జస్టిస్ రమణ వచ్చారు -బెయిల్ రద్దు భయంతో రాయబారాలు ఎంపీ రఘురామ తాజా బాంబు

|
Google Oneindia TeluguNews

సొంత పార్టీపై తిరుగుబావుటా ఎగరేసి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మళ్లీ జైలుకు పంపేదాకా ఆంద్రప్రదేశ్‌లో అడుగుపెట్టబోనని శపథం చేసిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా మరో బాంబు విసిరారు. జస్టిస్ ఎన్వీ రమణను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానివ్వకుండా తప్పుడు ఫిర్యాదులతో విఫలయత్నం చేసిన జగన్.. ఇవాళ అదే జడ్జి వద్దకు రాయబారుల్ని పంపాడని ఎంపీ తెలిపారు. ఏపీలో కరోనా విలయం, టీడీపీ నేతలపై వరుసదాడులు అంశాలపైనా ఆదివారం నాటి 'రాజధాని రచ్చబండ'లో ఆయన అతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే...

రేవంత్ రెడ్డికి మోదీ సర్కార్ షాక్ -ఎంపీ సహా ఇంకొందరి ట్వీట్లు బ్లాక్ -కరోనాపై ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీస్తే..రేవంత్ రెడ్డికి మోదీ సర్కార్ షాక్ -ఎంపీ సహా ఇంకొందరి ట్వీట్లు బ్లాక్ -కరోనాపై ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీస్తే..

షాకింగ్: ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలుడు -27మంది కొవిడ్ రోగులు దుర్మరణం, మరో 50 మందికిషాకింగ్: ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలుడు -27మంది కొవిడ్ రోగులు దుర్మరణం, మరో 50 మందికి

 జగన్.. ఇక ఒళ్లు జాగ్రత్త..

జగన్.. ఇక ఒళ్లు జాగ్రత్త..

''ఆంధ్రప్రదేశ్ లో గడిచిన రెండేళ్లుగా అరాచక పాలనకు వ్యతిరేకంగా జరుగుతోన్న పోరాటంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు సీన్ మారింది. సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ గా తెలుగు తేజం జస్టిస్ ఎన్వీ రమణ వచ్చారు. జగన్ ఇక ఒళ్లు దగ్గరపెట్టుకుంటే మంచింది. ఏపీ హైకోర్టుకు సుప్రీం కమాండ్ లా జస్టిస్ రమణ వ్యవహరిస్తున్నారంటూ తప్పుడు ఫిర్యాదులు చేయడమే కాకుండా, రమణపై చర్యలు తీసుకోవాలని న్యాయ నిపుణులూ కోరుతున్నట్లు జగన్ మీడియా బోగస్ ప్రచారాన్ని చేసింది. ఇప్పటికీ చేస్తున్నది. రమణను సీజేఐ కానివ్వకుండా జగన్ చేసిన పిచ్చి ప్రయత్నాలన్నీ దారుణంగా విఫలమయ్యాయి. నిజానికి..

ఢిల్లీలోని బ్రోకర్ల ద్వారా..

ఢిల్లీలోని బ్రోకర్ల ద్వారా..

దేశరాజధాని ఢిల్లీలో ఉండే తన బ్రోకర్ల ద్వారా జగన్.. జస్టిస్ రమణకు వ్యతిరేకంగా చాలా చేయించాడు. రేప్పొద్దున మోదీ ప్రధానిగా ఉండటానికి వీల్లేదని జగన్ కోరినా.. ఆ పని చేసి పెడతామని ఆ బ్రోకర్లు చెబుతారు. జస్టిస్ రమణ విషయంలోనూ అదే జరిగింది. రమణకు వ్యతిరేకంగా సీఎం జగన్ ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆయన సీజేఐ కాకుండా మేం చూసుకుంటామని కొందరు చెప్పడం వల్లే ఇదంతా జరిగింది. దేశంలోని రాజకీయ నాయకులపై పెండింగ్ కేసుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని తీర్పు ఇవ్వబట్టే న్యాయవ్యవస్థను భయభ్రాంతికి గురి చేయాలన్న ఉద్దేశంతో జగన్.. జస్టిస్ రమణపై ఈ రకమైన దాడికి దిగాడు. తన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టడంతో జగన్ ఇప్పుడు మళ్లీ..

 బెయిల్ రద్దు భయంతో రాయబారాలు..

బెయిల్ రద్దు భయంతో రాయబారాలు..

తెలుగు తేజం జస్టిస్ రమణ సీజేఐ అయిన వెంటనే జగన్ అనూహ్య చర్యలకు దిగాడు. తన బాబాయి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ఢిల్లీకి పంపించాడు. కొరియర్ బాయ్ లాగా శ్రీవారి ప్రసాదాలను పంచే ఆ తిరుపతి బ్యాచ్.. చిడతలు కొట్టుకుంటూ ఢిల్లీకి వెళ్లింది. ఇదే జడ్జి రమణగారు మూడు నెలల కిందట ఏపీ పర్యటనకు వస్తే ఇక్కడున్న ప్రోటోకాల్ అధికారులు, టీటీడీ చైర్మన్ కరోనా సాకుతో ముఖం చాటేసిన సంగతి ఎవరు మాత్రం మర్చిపోతారు తీరా జస్టిస్ రమణ సీజేఐ అయ్యాక.. నాడు మొఖం చాటేసినవాళ్లే ఇవాళ బాకాలు ఊదుతున్నారు. ఏం ఎందుకిలా బెయిల్ రద్దవుతుందని జగన్ కు భయమేసిందా అందుకే బాబాయితో రాయబారాలు మొదలెట్టాడా

నూరు గొడ్లను తిన్న రాబందులా..

నూరు గొడ్లను తిన్న రాబందులా..


తెలుగులో పాత సామెత ఒకటుంది, నూరు గొడ్లను తిన్న రాబందు ఒకేఒక్క గాలివానకు గోవిందా అంటుందట. ప్రస్తుతం జగన్ కు కూడా అదే పరిస్థితి రావొచ్చు. సీబీఐ కేసుల్లో ఆయన బెయిల్ రద్దు చేయాలని నేను వేసిన పిటిషన్ పై ఈనెల 27న తీర్పు రానుంది. సుప్రీంకోర్టునే భయపెట్టిన ఘన చరిత్ర జగన్ కు ఉంది కాబట్టి, ఒకవేళ సీబీఐ కోర్టు తీర్పు మాకు వ్యతిరేకంగా వస్తే కచ్చితంగా పైకోర్టును ఆశ్రయిస్తాం. న్యాయమూర్తులను, కోర్టులను బయపెట్టడం జగన్ మానుకోవాలి. ముందు తనపై కేసుల విచారణలు పూర్తి చేయించుకోవాలి. ఏడాదిన్నరగా కోర్టు విచారణలకు హాజరుకాని జగన్... ప్రత్యర్థులపై మాత్రం ఆఘమేఘాల మీద చర్యలకు దిగుతుండటం దుర్మార్గం. తాజాగా..

సీఎం అసలు మనిషేనా

సీఎం అసలు మనిషేనా

ఓవైపు ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంటే ప్రజల్ని కాపాడాల్సింది పోయి సీఎం జగన్ ప్రతీకార చర్యలకు దిగుతాడా ప్రశ్నించిన వాళ్లపై ఏసీబీ, సీఐడీలతో దాడులు చేయిస్తారా అచ్చెన్నాయుడితో మొదలుపెట్టి చంద్రబాబుపై, నాపైనా కేసులు పెట్టించారు. మొన్న దేవినేని ఉమ, నిన్న ధూళిపాళ నరేంద్ర మీద, ఇవాళేమో విశాఖ జిల్లా టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ భవంతి కూల్చేస్తారా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడిన పల్లా శ్రీనివాస్ పై ఈ సమయంలో ఇలాంటి చర్యలకు దిగడం కరెక్టేనా అసలు సీఎంకు కామన్ సెన్స్ ఉందా నువ్వసలు మనిషివని చెప్పుకోడానికి సిగ్గులేదా ఒక పక్క కరోనాతో రాష్ట్రం విలవిల్లాడుతోంటే, నీ కక్షలు తీర్చుకోడానికి ఇదారా సమయం

జగన్ గిల్లితే జనం గిల్లించుకోవాలా

జగన్ గిల్లితే జనం గిల్లించుకోవాలా

పోకిరి సినిమాలో విలన్ ప్రకాశ్ రాజ్ చెప్పే 'ఏయ్.. నేను గిల్లితే గిల్లించుకోవాలి..' డైలాగ్ తరహాలో ఏపీ సీఎం జగన్ వ్యవహరిస్తున్నాడు. కరోనా కట్టడిలో వ్యవస్థలన్నీ ఫెయిల్ అయ్యాయని సాక్ష్యాత్తూ ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియానే ప్రకటించగా, ఏపీలో మాత్రం పరీక్షలు పెడతానంటూ జగన్ హడావుడి చేస్తున్నాడు. సీఎంపై, వైసీపీ సర్కారుపై తిరుబాటు చేయాల్సిందిగా విద్యార్థులు, తల్లిదండ్రులకు నేను పిలుపునిస్తున్నాను. సీఎం ఎక్కడిదాకా వెళతాడో పోనివ్వండి, మీరు మాత్రం పరీక్షలు బహిష్కరించండి. కరోనా కేసులు, మరణాల విషయంలో ఏపీ ప్రభుత్వం చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలే. ఒక్క విజయవాడ స్మశానంలోనే రోజుకు 60 శవాలు వస్తున్నట్లు నాకు సమాచారం ఉంది. కరోనా మరణాలు ఉండొద్దని జగన్ ఆదేశించబట్టే, సీఎం అధికారులు కలెక్టర్లను మేనేజ్ చేసి తప్పుడు లెక్కలను వెల్లడిస్తున్నారు. ఈ అరాచకాలపై జగన్ తిరగబడే రోజు దగ్గర్లోనే ఉంది..'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

English summary
narsapuram ysrcp mp raghurama krishnam raju made serious allegations on andhra pradesh chief minister ys jagan over vendetta politics in the midst of covid crisis. speaking through social media on sunday, the rebel mp mentions cji justice nv ramana name to threat ys jagan. raghu rama demands ap govt to cancel all exams in ap.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X