Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విజయసాయి రెడ్డికి కీలక పదవిని ఇచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ/అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ అధినేత‌, రాజ్య‌స‌భలో ప్రతిపక్ష నాయకుడు స‌భ్యుడు వీ విజ‌యసాయి రెడ్డికి మరో అరుదైన అవ‌కాశం ల‌భించింది. ఇదివరకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఆయన నామినేట్ అయ్యారు. ఇప్పుడు తాజాగా పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ సభ్యుడిగా కూడా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ కోసం ఎన్నికైన సభ్యుల జాబితాను విడుదల చేసింది.

దేశంలో నాలుగో అతిపెద్ద పార్టీ అయిన వైఎస్ఆర్సీపీకి రాజ్యసభలో ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు విజయసాయి రెడ్డి. వైసీపీ పార్లమెంటరీ పార్టీ అధినేతగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రాజ్యసభ సభ్యుడిగా రెండు స్టాండింగ్ కమిటీలకూ ఛైర్మన్‌గానూ ఉన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ట్రాన్స్‌పోర్ట్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ టూరిజం అండ్ కల్చర్‌కు ఛైర్మన్‌గా ఉంటోన్నారు. రాజ్య‌స‌భ వైస్ ఛైర్మ‌న్‌గా కూడా విజయసాయి రెడ్డి ఎంపిక‌య్యారు.

Vijayasai Reddy

ఇప్పుడు తాజాగా విజయసాయి రెడ్డికి కీలకమైన పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీలో సభ్యత్వం లభించింది. ఈ కమిటీలో ఆయనతో పాటు డాక్టర్ రాధా మోహన్ దాస్ అగర్వాల్, సయ్యద్ నాజిర్ హుస్సేన్, డాక్టర్ అనిల్ జైన్, ప్రకాష్ జవదేకర్, డాక్టర్ అమర్ పట్నాయక్, బినోయ్ విశ్వం ఎంపికయ్యారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులను కూడా రాజ్యసభ ఎంపిక చేసింది. దీనికోసం జరిగిన ఎన్నికల ప్రకియలో మొత్తం ఏడు మంది సభ్యులకు అవకాశం దక్కింది.

Dr K Laxman

భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఈ కమిటీలో సభ్యత్వాన్ని సాధించారు. ఆయనతో పాటు శక్తిసిన్హ్ గోహిల్, సుఖేందు శేఖర్ రాయ్, తిరుచ్చి శివ, డాక్టర్ ఎం తంబిదొరై, ఘన్‌శ్యామ్ తివారీ, డాక్టర్ సుధాంశు త్రివేది ఎన్నికయ్యారు. ప్రజా పద్దుల నిర్వహణలో కీలక పాత్ర పోషించే కమిటీలో తెలంగాణకు చెందిన డాక్టర్ కే లక్ష్మణ్‌కు చోటు దక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Vijayasai Reddy

కాగా- పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీలో చోటు సాధించిన వీ విజయసాయి రెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు అభినందించారు. ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, లోక్ సభ సభ్యులు గొడ్డేటి మాధవి, చింతా అనురాధ.. విజయసాయి రెడ్డిని ఆయన నివాసంలో కలిసి అభినందనలు తెలియజేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+