ఇసుక తుఫాన్‌లో టీడీపీ- ఫ్రీ అంటే టన్నుకు రూ.3,000 అని అర్థం

Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ప్రకటించిన ఉచిత ఇసుక పాలసీ రాష్ట్రంలో దుమారం రేపుతోంది. ఉచితం- అని ఒక్క పక్క అంటూనే.. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కంటే ఎన్నో రెట్లు అధికంగా డబ్బులను వసూలు చేస్తోండటం కాకరేపుతోంది.

ఇసుక డిపోల వద్ద బ్యానర్లు కట్టి మరీ టన్నుకు 1,200 నుంచి 1,400 రూపాయల వరకు వసూలు చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఒకే బ్యానర్‌లో నూతన ఉచిత ఇసుక విధానము అంటూ తాటికాయంత అక్షరాలు రాసి వాటి కింద ఒక టన్ను ఇసుకకు ఎంత మొత్తాన్ని వసూలు చేస్తోన్నామంటూ గతంలో పెద్ద ఎత్తున రీచ్‌ల వద్ద బ్యానర్లు కట్టిన విషయం తెలిసిందే. దీనికి రవాణా ఛార్జీలు అదనం. లోడింగ్ ఛార్జీలను సైతం కొనుగోలుదారుల మీదే మోపింది కూటమి సర్కార్.

YSRCP MP Vijayasai Reddy criticized the TDP govt in the Free Sand issue

ఈ విధానంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ- టీడీపీ కూటమి ప్రభుత్వంపై విమర్శలకు దిగింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే చంద్రబాబు తన నైజాన్ని బయటపెట్టుకున్నారంటూ మండిపడుతోంది. ప్రజలను నమ్మించి మరీ మోసం చేసిందంటూ ధ్వజమెత్తుతోంది. తమ హయాంలో టన్ను ఇసుక 475 రూపాయలు ఉంటే ఇప్పుడు అదే టన్ను ఇసుకకు 3,000 రూపాయలను వసూలు చేస్తోన్నారంటూ మండిపడుతోంది.

ఇటీవలే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి పనసపాడుకు ఓ వ్యక్తి 20 టన్నుల ఇసుకను బుక్‌ చేసుకోగా దాన్ని తరలించడానికి 9,276 రూపాయలతో కలిపి 16,640 రూపాయలు వసూలు చేశారంటూ పోస్ట్ చేసిన ఓ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

YSRCP MP Vijayasai Reddy criticized the TDP govt in the Free Sand issue

దీనిపై వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి ఘాటాగా స్పందించారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుకను ఇష్టానుసారంగా దోపిడీ చేస్తోన్నారని మరో వంక ఉచిత ఇసుక ఇస్తోన్నామంటూ చంద్రబాబు గొప్పలు చెబుతున్నారని విమర్శించారు.

టీడీపీ నాయకులు రాష్ట్రంలో ఇసుక కొరతను సృష్టించారని, దీనివల్ల లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు జీవనోపాధిని కోల్పోతోన్నారని ఆరోపించారు. తమ హయాంలో ఇసుక ధర టన్నుకు 475 రూపాయలు ఉండగా ఇప్పుడు 3,000 రూపాయలకు పెరిగిందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+