టీడీపీ-బీజేపీ-జనసేన- ఎవరి ఓట్లు ఎవరి కంటే ? సాయిరెడ్డి తాజా విశ్లేషణ..!
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రత్యర్ధులపై మైండ్ గేమ్ లకు సైతం తెరలేపుతున్నాయి. ముఖ్యంగా వైసీపీపై విపక్షాలు మైండ్ గేమ్ ప్రయోగిస్తుంటే.. వైసీపీ నేతలుకూడా విపక్షాల్ని అదే మైండ్ గేమ్ లో ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ విపక్షాలను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు.
తన తాజా ట్వీట్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విపక్ష పార్టీల మధ్య ఓట్ల బదిలీ ఎలా ఉండబోతోందో విశ్లేషించారు. అంతకన్నా ముందు వైసీపీ కంటే విపక్షం ఎంతో దూరంలో ఉండబోతోందంటూ మరో ఫీలర్ కూడా వదిలారు. రెండో స్ధానం కోసం విపక్ష పార్టీలైన టీడీపీ-బీజేపీ-జనసేన పోటీ పడుతున్నాయంటూ సాయిరెడ్డి చెప్పుకొచ్చారు.అలాగే ఎవరి ఓట్లు ఎవరికి ఎలా బదిలీ అవుతాయో కూడా తన ట్వీట్ లో సాయిరెడ్డి స్పష్టం చేశారు.

ఏపీలో 2024లో జరిగే ఎన్నికల్లో ఎక్కడో దూరంలో రెండో స్ధానం కోసం గట్టి పోటీ ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే టీడీపీ సానుభూతిపరుల ఓట్లు జనసేనకు పడేలా అండర్ కరెంట్ ఉందని సాయిరెడ్డి తెలిపారు. అలాగే జనసేన ఓటర్లు బీజేపీకి షిప్ట్ అయ్యే అవకాశం ఉందని సాయిరెడ్డి తెలిపారు. ఏదేమైనా విపక్షాలు 2024ను వదిలిపెట్టి 2029 కోసం సన్నాహాలు మొదలుపెట్టాలని విజయసాయిరెడ్డి సూచించారు. ఎందుకో కూడా చెప్పేశారు.
వైసీపీ 2024లో జరిగే ఎన్నికల్లో 51 శాతానికి పైగా ఓటు శాతం సాధిస్తుందని విజయసాయిరెడ్డి విశ్లేషించారు. కాబట్టి విపక్షాలు 2024పై ఆశలు వదులుకని 2029పై దృష్టిపెట్టాలని సాయిరెడ్డి సూచించారు. ఇప్పటికే వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకమవుతున్న నేపథ్యంలో వారి ఓట్ల బదిలీపై వ్యాఖ్యలు చేయడం ద్వారా భవిష్యత్తులో ఏర్పడే కూటమిలో చీలికలు తెచ్చేందుకు ఇప్పటి నుంచే సాయిరెడ్డి మైండ్ గేమ్ మొదలుపెట్టినట్లు అర్ధమవుతోంది.












Click it and Unblock the Notifications