తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గంటా భార్యను రచ్చలోకి లాగిన వైసీపీ విజయసాయిరెడ్డి -బ్లాక్ టికెట్లతో బతుకు మొదలైందంటూ బాబుపైనా

|
Google Oneindia TeluguNews

సరిగ్గా కార్పొరేషన్ ఎన్నికలకు ముందు.. విశాఖపట్నం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి చేరబోతున్నారని, ఆయన ప్రతిపాదనలకు సీఎం జగన్ ఆమోదమే తరువాయి అని ఎంపీ విజయసాయిరెడ్డి బాంబు పేల్చడం ఎంత రచ్చకు దారితీసిందో తెలిసిందే. సాయిరెడ్డికి అందిన సమాచారం ఫేక్ అయిఉంటుందని, టీడీపీని వీడబోనని గంటా క్లారిటీ ఇవ్వడంతో నాటి వివాదం సర్దుమణిగింది. కానీ ఎంపీ సాయిరెడ్డి మరోసారి గంటాను, ఆయన నేతృత్వం వహించే టీడీపీని, దాని చీఫ్ చంద్రబాబును టార్గెట్ చేశారు. గంటా శ్రీనివాసరావు సతీమణి శారదను సైతం వివాదంలోకి లాగారు..

కామసూత్ర, కొరియర్ బాయ్ -జగన్ బాబాయిపై రఘురామ సంచలనం -నర్సాపురంలో ఉపఎన్నిక, షాక్కామసూత్ర, కొరియర్ బాయ్ -జగన్ బాబాయిపై రఘురామ సంచలనం -నర్సాపురంలో ఉపఎన్నిక, షాక్

గంటా సతీమణి చౌదరి..

గంటా సతీమణి చౌదరి..


విశాఖపట్నం జిల్లాలోని ప్రఖ్యాత సింహాచలం దేవస్థానంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకంపై గడిచిన రెండేళ్లుగా వివాదం కొనసాగుతుండటం, కరోనా లాక్ డౌన్ సమయంలో ఉద్యోగాలు కోల్పోయినవారిని సీఎం జగన్ ఆదేశాలతో తిరిగి విధుల్లోకి తీసుకోవడం, ఆలయం పనితీరు, సిబ్బంది నియామకాలకు సంబంధించి గత చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రస్తుత చైర్ పర్సన్ సంచైత గజపతి రాజు సైతం తరచూ విమర్వలు చేస్తుండటం తెలిసిందే. వైసీపీ ఎంపీ సాయిరెడ్డి సైతం అదే సింహాచలం ఆలయంలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకాలను ప్రస్తావిస్తూ 'గంటా సతీమణి చౌదరి మేడం' అంటూ కామెంట్లు చేశారు..

వ్యాక్సిన్ల కొరత: నిద్ర లేచిన కేంద్రం -సీరం సంస్థకు రూ.3వేల కోట్లు, భారత్ బయోటెక్‌కు రూ.1500కోట్లు అప్పు, కానీవ్యాక్సిన్ల కొరత: నిద్ర లేచిన కేంద్రం -సీరం సంస్థకు రూ.3వేల కోట్లు, భారత్ బయోటెక్‌కు రూ.1500కోట్లు అప్పు, కానీ

దిగజారడానికి మెట్లు లేవు..

దిగజారడానికి మెట్లు లేవు..


''సింహాచలం దేవస్థానం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ఎక్కువ మందిని గంటా సతీమణి చౌదరి మేడం నియమించారట! చంద్రబాబూ నీ పార్టీ దిగజారడానికి ఇక మెట్లు లేవు. 2 ఛానళ్లు, 2 పేపర్లలో చూసుకుని మురిసిపోవడమే. రాష్ట్రంలో ఇంకా పచ్చ పార్టీ ఉందనే భ్రమ కల్పించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా బాబూ?'' అని విజయసాయిరెడ్డి రాశారు. జగన్ పాలన మొదలై రెండేళ్లు పూర్తికాగా, సింహాచలం దేవస్థానంలో ఉద్యోగ నియామకాలపై వివాదం ముగిసిపోయిందనుకునేలోపే ఎంపీ సాయిరెడ్డి మరోసారి ఆ అంశాన్ని లేవనెత్తడం రచ్చకు దారితీసింది. ఇదిలా ఉంటే..

వివేకా హత్య.. సాయిరెడ్డి సంచలనం

వివేకా హత్య.. సాయిరెడ్డి సంచలనం


ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వివాదంపై ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చేస్తోన్న ఆరోపణలపైనా వైసీపీ ఎంపీ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యకు సంబందించి తన వద్ద కీలక ఆధారాలున్నాయని ఏబీవీ సీబీఐకి లేఖరాయడాన్ని సాయిరెడ్డి తప్పుపట్టారు. ''ఏబీ వెంకటేశ్వరరావు...ఫోన్ ట్యాపర్. దేశ ద్రోహం కేసులో నిందితుడు. అతని సాక్ష్యానికి విలువేముంటుంది? కొడుకు కంపెనీ కోసం విదేశంతో కుమ్మక్కైన దేశ ద్రోహి అతను. సాక్ష్యాలుంటే షోడో హోం మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసినట్లు? ప్రవర్తనా నిమావళిని ఉల్లంఘించినవాడా ప్రవర్తన గురించి మాట్లాదేది? చంద్రబాబు అరాచక పాలనలో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీవీ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహారాలు నడిపాడు. ఇజ్రాయిల్ నిఘా పరికరాల స్కామ్ ఒక్కటే కాదు. ఫోన్ ట్యాపింగులు, జగన్ గారిపై వైజాగ్ లో హత్యాయత్నం అన్నీ అతని కనుసన్నల్లోనే జరిగాయి. ఇంకా చాలా బయటికొస్తాయి. చట్టం నుంచి తప్పించుకోలేడు'' అని ఎంపీ హెచ్చరించారు. అలాగే,

అచ్చెన్న వీడియోతో లోకేశ్ వణుకు

అచ్చెన్న వీడియోతో లోకేశ్ వణుకు

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక తర్వాత పార్టీ లేదు, బొక్కా లేదు అంటూ ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు మాట్లాడినట్లుగా ఉన్న వీడియో క్లిప్ దుమారం రేపిన సంగతి తెలిసిందే. దానిపై టీడీపీ నేతలంతా సైలెంటైపోయినా, వైసీపీ ఎంపీ సాయిరెడ్డి మాత్రం అదే పనిగా సెటైర్లు వేస్తున్నారు. వీడియోపై వివరణ ఇవ్వడానికి అచ్చెన్న నిరాకరించారనీ చెప్పుకొచ్చారు. ''తిరుపతి ఉప ఎన్నిక ఫలితం తర్వాత పచ్చ పార్టీని పీకేస్తారా? 'పార్టీ లేదూ బొక్కా'లేదన్న అచ్చెన్నను పీకుతారా? విషయం బయటపడటంతో పప్పును పంపిచేస్తారా? నవ్విపోదురుగాక నాకేటి సిగ్గని ఊరుకుంటారా? ఏమో ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామికే ఎరుక! సంచలన వీడియోపై బాబుకు వివరణ ఇవ్వాలన్న సలహాలను అచ్చెన్న తిరస్కరించాడట. సారీ లేదు, బొక్కా లేదు. ఎక్కువ చేస్తే ఇంకా చాలా కక్కాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చాడని సమాచారం. ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నతో పాటు చినబాబు హస్తం కూడా ఉన్నందున వివరణ అడగటానికి బాబు జంకుతున్నాడట'' అని సాయిరెడ్డి పేర్కొన్నారు. చివరిగా..

బ్లాక్ టికెట్లతో బతుకు మొదలై..

బ్లాక్ టికెట్లతో బతుకు మొదలై..

ఇవాళ (ఏప్రిల్ 20) టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పుట్టినరోజు కావడంతో ఆయనకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం మర్యాదపూర్వకంగా బాబుకు విషెస్ తెలిపారు. అయితే, ఈ సందర్భంలోనూ ఎంపీ సాయిరెడ్డి మాత్రం బాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ''సినిమా థియేటర్లలో బ్లాక్ టికెట్లు అమ్మడం ద్వారా చంద్రబాబు తన వృత్తిని ప్రారంభించాడు. నలుపు తన అభిమానంగా మిగిలిపోయింది. నల్లధనాన్ని సంపాదించడానికే తన జీవిత శక్తిని ధారపోశాడు. అనేక చీకటిలో ఒప్పందాల కళతో బినామీ సంపదను తరలించాడు'' అని సాయిరెడ్డి ఆరోపించారు.

English summary
ysrcp key leader and rajya sabha mp vijaya sai reddy drags tdp mla ganta srinivasa rao wife into simhachalam temple outsourcing employees recruitment issues. in a series of tweets on tuesday, vijaya sai reddy slams tdp chief chandrababu amid atchannaidu video leak.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X